సెన్సేషనల్ రికార్డ్

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ట్రేడ్ ఎనలిస్ట్‌లా అంచనాలను కూడా మించేసి ఏకంగా 46 కోట్ల షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుని రికార్డ్ ను నమోదు చేసింది.

ఇవి ఆల్ టైం హిస్టారికల్ డే 1 కలెక్షన్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి రోజు 10 కోట్ల పైగా రేంజ్ లో హైర్స్ ని టోటల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా అది పక్కకు పెట్టినా వర్త్ షేర్ పరంగా కూడా సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేసింది. ప్రస్తుత ట్రెండ్ ని చూస్తుంటే సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో పరుగును కొనసాగించగా అల్టిమేట్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోయింది సినిమా.రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 90% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా…ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 95% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది సినిమా.

దాంతో రెండో రోజు కూడా సినిమా ఇప్పుడు సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా రెండో రోజు కొత్త సినిమా నుండి పోటి ఎదురు అయినా అల్టిమేట్ గా హోల్డ్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఇక మూడో రోజు నుండి సంక్రాంతి సెలవులు వారం పాటు ఉంటాయి కాబట్టి మరింత జోరు గా కలెక్షన్స్ ని సాధించి బిజినెస్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.

ఇక బిజినెస్ లో చాలా మొత్తం మొదటి రోజే వెనక్కి రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు సాధించే కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ సగానికి పైగా బిజినెస్ ని రికవరీ చేయబోతుందని చెప్పాలి. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఇక మొదటీ రోజు బ్రేకప్ విషయానికి వస్తే నైజాంలో రూ. 8.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.4 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, గుంటూరులో రూ. 5.15 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 3.35 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 2.72 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్ల షేర్ వసూలైనట్టు పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్‌పై సరిలేరు నీకెవ్వరు దాడి కనిపించింది. బాక్సాఫీస్ బద్దలయ్యేలా మొదటిరోజే 1 మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టాడు మన సూపర్ స్టార్. ఈ సినిమా ద్వారా 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్.

సౌత్ ఇండియా లోనే ఇప్పటిదాకా ఇలా పది సార్లు 1 మిలియన్ సాధించిన హీరోలు లేరు. ఆ ఫీట్ మహేష్ మాత్రమే చేరుకోగలిగాడు. అంతేకాకుండా ఇదే ట్రెండు ని కొనసాగిస్తూ ఈ చిత్రం 1.5 మిలియన్ మార్కు ని కూడా అందుకుంది. ఇది మహేష్ కి 8వ 1.5మిలియన్ మార్కు చిత్రం.

ప్రతీ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌లు వచ్చేవి.. ఈ సారి బ్లాక్‌బస్టర్‌కి బాబు వచ్చాడు అని పేర్కొంటూ సరిలేరు నీకెవ్వరు సత్తాను ప్రేక్షకులకు తెలియజేసింది చిత్రయూనిట్. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని టీమ్ అంతా కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మొత్తానికి మరోసారి రికార్డులు తిరగ రాస్తున్నాడు మహేష్

Share

Leave a Comment