ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?

మహర్షి ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే విదేశాలకు హాలిడే కోసం వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా ప్రపంచకప్ మ్యాచులు చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు మూవీ మే 31 వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుందని సమాచారం. జీ.ఎం.బి ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ.కె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై మహేష్ బాబు, దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా రూపొందించనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లో రష్మిక మందన్న కథానాయిక.

మహేష్ బాబు లేకుండానే పూజా కార్యక్రమాలు చేసేసిన టీం ప్రస్తుతం ప్రిన్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తారని సినిమా ప్రారంభోత్సవం రోజునే దర్శకుడు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను చిత్రబృందం కశ్మీర్‌లో ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. సో రాగానే మహేష్ బిజీగా మారిపోతాడన్న మాట.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. బాలన్స్ ఉన్న 180 రోజుల్లో పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీ చేయాలి. అప్పుడే సంక్రాంతి రేస్ కు సరిలేరు నీకెవ్వరు సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

25వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో మహేష్ 26 వ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు తగ్గట్లే ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతుందని కొబ్బరి కాయ కొట్టిన రోజే ప్రేక్షకులకు చెప్పేసారు అనిల్ రావిఫూడి.

ఈ సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ‌కీయాల కార‌ణంగా 13 ఏళ్లు సినిమాల‌కు విరామం తరువాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారికి, మ‌హేష్ బాబు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి అని అనిల్ రావిఫూడి చెప్పారు.

అలాగే జ‌గ‌ప‌తి బాబు గారు కూడా మంచి ప్రాత‌లో న‌టిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ తోనే సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలను అమాతం పెంచేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిఫూడి. ఇంక కధ ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో మరి ఆయన. ఈ సినిమా రిలీజ్ ను ఇప్పుడే ప్రకటించడం కూడా అనిల్ రావిపూడి దూకుడును చూపిస్తోంది. కొబ్బరికాయ కొట్టిన రోజే ఫుల్ క్లారిటీతో కనిపించారు రావిపూడి.

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కంపోజ్ చేయడం త్వరలోనే ప్రారంభం కానుంది. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు మహేష్ రాగానే మెట్రో స్పీడ్ తో పరిగెత్తనుంది. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలవకుండానే సరిలేరు నీకెవ్వరు పై భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. 25 వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. నిన్నటితో ఈ సినిమా విడుదలై 34 రోజులు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఆరో వారంలోకి అడుగుపెడుతున్న మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.

మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది. చూస్తుంటే మహర్షి జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. మరో వారం రోజులు ఈ సినిమా జోరుగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు.

వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది. మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ ను మహేష్ చూసిన సంగతి తెలిసిందే. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Share

Leave a Comment