అంత ఫాస్ట్ గా..!

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా విడుదలవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ నిన్నటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. స్పెషల్ గా ఒక గ్రూప్ పిక్ ని కూడా పోస్ట్ చేసారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ జులై 5న మొదలైన ఈ సరిలేరు నీకెవ్వరు మెమొరబుల్ జర్నీ డిసెంబర్ 18 తో పూర్తయింది. ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు, మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక‌ మెమరబుల్ జ్ఞాపకంగా గా ఉండబోతుంది అన్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.

2018 మే 31న షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. జూలై 5 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. అనీల్ రావిపూడి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో ఈ సినిమాని మారథాన్ తరహాలో పూర్తి చేయడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు మహేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తయిన రెండో చిత్రం ఇదేనని తెలుస్తోంది.

ఇంతకుముందు పూరి దర్శకత్వం వహించిన `బిజినెస్ మేన్` అత్యంత వేగంగా పూర్తయింది. చాలా తక్కువ రోజుల్లో ఆ సినిమాని పూర్తి చేసాడు పూరి. ఇప్పుడు అనీల్ రావిపూడి అంతే వేగంగా సరిలేరు షూటింగ్ పూర్తి చేయడం ఆసక్తికరం. మహేష్ కెరీర్ లోనే తక్కువ రోజుల్లో పూర్తయిన రెండో చిత్రమిది.

షూటింగ్ ప్రారంభమైంది మొదలు అస్సలు గ్యాప్ అన్నదే లేకుండా సరిలేరు షూటింగ్ పూర్తి చేసారు. ముందే చెప్పిన సమయానికే అన్నిపనులు పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ పోస్టర్ లోనే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

అలాగే నేడు నిర్మాత దిల్‌ రాజు జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవరు చిత్ర యూనిట్‌ ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. దిల్ రాజు గారికి మహేష్ మొదలకుని చిత్ర యూనిట్ అందరూ శుభాకాంక్షలు తెలియజేసారు. షూటింగ్ లో జరిపిన బర్త్‌డ్ సెలెబ్రేషన్ పిక్స్ ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసారు.

నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత మరపురాని జ్ఞాపకాన్నిఇచ్చిన నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ అద్భుతమైన షూటింగ్ ని సంతోషకరంగా ముగించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌, కిశోర్‌ గరికిపాటి సహా ఎంటైర్ సరిలేరు నీకెవ్వరు యూనిట్ కి థాంక్స్’ అన్నారు.

ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్స్ ట్రీట్ మైమరిపిస్తోంది. ఈ సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్ననాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి.

జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.

వరుసగా భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్‌. ఈ రెండింటి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సరిలేరు నీకెవ్వరుపై భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానుల అంచానాలకి అనుగునంగానే ఈ చిత్రం ఉండబోతుంది అని వినికిడి. మరో బ్లాక్ బస్టర్ ఖాయంగా కనిపిస్తుంది.

Share

Leave a Comment