జాతీయ స్థాయిలో వరుసగా టాప్ 4

ఈ మద్య కాలంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తమ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలని ఉత్సాహంగా అభిమానులు ఉంటున్నారు. యూట్యూబ్.. ట్విట్టర్ లలో స్టార్స్ సినిమాలకు సంబంధించిన ట్రెండ్స్ ఈమద్య మనం చూస్తూనే ఉన్నాం.

తెలుగు సినిమా స్టార్స్ సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం విషయంలో చాలా ముందు ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయమై ట్రెండింగ్ లోనే ఉంటుంది.

జాతీయ స్థాయిలో మన స్టార్ హీరోలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. కాని మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన నాలుగు హ్యాష్ ట్యాగ్ లు వరుసగా టాప్ 4 గా జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఇలాంటి అరుదైన రికార్డు వచ్చి ఉండదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నేడు సాయంత్రంకు సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి పాట మైండ్ బ్లాంక్ రాబోతున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ మొదలైంది. నిర్విరామంగా ఇంకా ఇప్పటికీ ట్రెండ్ అవుతుండడం విశేషం. దీని బట్టి మహేష్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది.

మైండ్ బ్లాక్.. మహేష్ బాబు సాంగ్.. సరిలేరు నీకెవ్వరు.. మాస్ మహేష్ బాబు మండేస్ ఈ నాలుగు హ్యాష్ ట్యాగ్స్ రాత్రి తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. మీరు చాలా గ్రేట్ టాప్ 4 ఇండియా ట్రెండ్స్ సరిలేరు నీకెవ్వరు అంటూ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

సరిలేరు మీకెవ్వరు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా నెలన్నర రోజుల సమయం ఉంది. ఇప్పటి నుండే సినిమా సందడి షురూ అవుతోంది. ఇప్పటికే టీజర్ తో రికార్డులు సృష్టించిన మహేష్ బాబు సరికొత్త ప్రమోషన్ పద్దతితో డిసెంబర్ నెల మొత్తం కూడా సందడి చేయబోతున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం పాటల్లో మొదటి పాట మైండ్ బ్లాంక్ ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నేడు సాయంత్రం 5.04 గంటలకు మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాట రాబోతున్న ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు.

సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా నమ్మకంతో పాట కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు.. దేవిశ్రీ ప్రసాద్ ల కాంబోలో వచ్చిన గత చిత్రాల పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ ఆల్బమ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ మరియు ఫ్యాన్స్ ఉన్నారు.

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. సరిలేరు నీకెవ్వరు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అని అందరూ ధీమాగా ఉన్నారు.

మహేష్ బాబుకు జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాలో రాములమ్మ విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈసారి పూర్తిగా కమర్షియల్‌ ఫార్ములాకి తగ్గట్టుగా ఎక్కడ ఏది వుండాలో అలా మీటర్‌లో వేస్తూ పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేస్తున్నాడు రావిపూడి. డబుల్ క్రేజ్ ఉన్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Share

Leave a Comment