ముంబైలో సూపర్‌స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేష్ బాబు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది.

అక్కడ వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ సెట్‌లో ఒక అదిరిపోయే యాక్సన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఈ షెడ్యూల్‌కి మంగళవారంతో ప్యాకప్‌ చెప్పారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుంది. దేవాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ప్లాన్‌ చేశారని సమాచారం.

అంటే కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో విలన్లను రప్ఫాడించిన అజయ్‌ కృష్ణ తర్వాత గుడిలో పూజలు చేయనున్నారన మాట. ఈ సన్నివేశాల కోసం హైదరాబాద్ లోని ప్రఖ్యాత గాంచిన చిలకూరు బాలాజీ దేవాలయం ను ఎంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే మహేష్ ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాల్లో పాలుపంచుకుంటారని సమాచారం.

2)

నిన్నటితో సరిలేరు నీకెవ్వరు షెడ్యూల్ ముగియడంతో మహేష్ ఈ రోజు ముంబై చేరుకున్నారు. మహేష్ ముంబై ఏయిర్ పోర్ట్ లో ఉన్న ఫొటోలను బాలీవుడ్ మీడియా ప్రచురించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబై నుంచి వచ్చాక మహేష్ మళ్ళీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీ కానున్నారు.

చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి గారి పాత్ర గురించి సస్పెన్సు ఇంకా కొనసాగుతోంది. ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో విజయశాంతి కనిపించనున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరి ఈ సినిమాలో వీరిద్దరి పాత్రకు ఎలాంటి సంబంధం ఉంటుందో అధికారికంగా తెలియాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వాల్సిందే. అభిమానుల అంచనాలు రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తన 25 వ సినిమాగా మహర్షి రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. ఇప్పుడు దాన్ని మించి వుండే విధంగా సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీకి కొదవ ఉండదు. ఈ సారి ఇంకా భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment