మూడోసారి కూడా అదే జోరు…

సంక్రాంతికి వచ్చే సినిమాలను సాధారణంగా థియేటర్లకు వెళ్లి ఎక్కువగా చూస్తారు. ప్రస్తుతం పైరసీ కూడా ఎక్కువైపోయింది కాబట్టి థియేటర్‌లోకి వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో ఆన్‌లైన్‌లో సినిమాలు దొరికేస్తుంది. సినిమా విడుదలైన 30 రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి

ఇక ఆ తరవాత టీవీల్లో వస్తే ఎవరు చూస్తారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు నిరూపించింది. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను భారీ మొత్తానికి జెమిని టీవీ హక్కులు సొంతం చేసుకుంది

ఇప్పటి వరకు మూడు సార్లు జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ఈ మూడు సార్లు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ ను దక్కించుకుంది. మామూలుగా అయితే ఒకటి రెండు సార్లు మంచి రేటింగ్ ను దక్కించుకోవడం కామన్. కాని ఈ సినిమా మూడవ సారి కూడా మంచి రేటింగ్ దక్కించుకుని రికార్డు సృష్టించింది

మూడవ సారి ప్రసారం అయ్యి అత్యధిక రేటింగ్ దక్కించుకున్న సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. గత వారం జెమిని టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా ఏకంగా 12.55 టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్) సాధించింది. ఈ స్థాయి రేటింగ్ దక్కించుకోవడం చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

తెలుగు సినిమా మూడవ సారి టీవీలో ప్రసారం అయ్యి ఈ స్థాయిలో రేటింగ్ దక్కించుకోవడం ఇదే మొదటి సారి. దీంతో మరోసారి తన స్టామినాను మహేష్ బాబు చూపించాడు. ఈ సినిమా మొదటి సారి 23.4 టీవీఆర్‌ను సొంతం చేసుకుని తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త అధ్యానానికి నాంది పలికింది. రెండోసారి ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు సినిమా 17.4 టీవీఆర్‌ తో మరో రికార్డును సొంతం చేసుకుంది

ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మూడవ సారి 12.55 సాధించి మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాను కన్నడ లో డబ్ చేసి ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించారు. అక్కడ బుల్లితెరపై అత్యధిక టీవీఆర్ దక్కించుకున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. అక్కడ ఈ చిత్రం 6.5 రేటింగ్ని సాధించింది

అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీలక పాత్రను విజయశాంతి చేసింది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా బుల్లి తెరపై రికార్డుల మోత మోగిస్తుంది

ఆన్‌లైన్‌లోనూ ఈ సినిమా ఉన్నప్పటికీ, బుల్లితెరపైన ప్రదర్శితమైన ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గకపోవడం గమనర్హం. మొత్తంగా స్మాల్ స్క్రీన్ పై మహేష్ బాబు కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో సరిలేరు నీకెవ్వరు సినిమా మరోసారి ఋజువు చేసింది. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట పై ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి

Share

Leave a Comment