మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవక్వరు. ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ 46.7 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఎనిమిది రోజుల్లో రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృస్టించింది.

మొత్తంగా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడ్డారు. సరిలేరు నీకెవ్వరు మరో అరుదైన మైలు రాయిని చేరుకుంది. యూఎస్ బాక్సాపీస్ వద్ద $2 మిలియన్ మార్క్ వసూళ్లు దాటివేసింది. విడుదలైన వారం తరువాత సరిలేరు నీకెవ్వరు $ 2 మిలియన్ వసూళ్లను చేరుకొంది.

మహేష్ బాబు కెరీర్ లో $ 2 మిలియన్ వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. గతంలో ఆయన నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు ఈ ఫీట్ ని సాధించాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో యూఎస్ లో మహేష్ తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు.

ఓవరాల్ గా మహేష్ కెరీర్ లో 8 వ 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా గా, 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద తొలి రోజే 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్. ఇది నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డు గా పరిగణించవచ్చు. మహేష్ సినిమాలంటే విదేశాలలో మొదటి నుంచి అదే క్రేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి రుజువయింది.

మొత్తంగా చూసుకుంటే 8 రోజుల్లో రూ. 113 కోట్లను రాబట్టింది. 8 రోజుల్లో ఏరియా వైజ్‌గా చూసుకుంటే.. నైజాం లో రూ. 29.8 కోట్లు వసూలు చేస్తే సీడెడ్ లో రూ. 13.25 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్ర రూ. 14.9 కోట్లు, ఈస్ట్ 9.4 కోట్లు, వెస్ట్ 6.02 కోట్లు, కృష్ణా రూ. 7.34 కోట్లు, గుంటూరు 8.51 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లను వసూలు చేసింది.

మొత్తంగా కోస్తాంధ్ర మొత్తం రూ. 49.13 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 62.38 కోట్లు వసూలు చేసింది. తెలంగాణ వసూళ్లను కలిపితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ. 92.18 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

మిగతా ఏరియాల విషయానికొస్తే కర్ణాటకలో రూ. 7కోట్లు, తమిళనాడు రూ. 1కోటి, రెస్టాఫ్ ఇండియా రూ. 1.5కోట్లు, యూఎస్ మార్కెట్‌లో రూ. 8కోట్లు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మిగతా దేశాల్లో రూ. 3కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా రూ. 113కోట్ల దాకా వసూలు చేసింది. నిన్న ఆదివారం సెలవు కావడం సరిలేరు నీకెవ్వరు సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

సంక్రాంతి పండుగ వేళ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ ప్రమోషన్ వర్క్ తో మరింత దూసుకెళ్లేందుకు వీలుగా వరంగల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సూపర్‌స్టార్ మహేశ్ తనదైన శైలి లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

ప్రమోషన్స్ పూర్తి కావడంతో హాలిడే ట్రిప్ కు బయలుదేరారు. మహేష్ సతీమణి నమ్రత ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ఫోటోలను మేము హాలిడే కి వెల్తున్నాము అని పోస్ట్ చేసారు.

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ తన నెక్స్ట్ ఫిలిం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ సాగుతోందని.. మహేష్ అమెరికా ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమాను లాంచ్ చేస్తారని సమాచారం.

Share

Leave a Comment