మహేష్ స్పెషల్ కేర్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ ఐదు నెలల గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే.

మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సర్కారు వారి పాటలో మహేష్ క్యారక్టరైజేషన్, మేనరిజం నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతునట్లుగా ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

దీనికి తగ్గట్టే ఫుల్ అవుట్ అండ్ అవుట్ రగడ్, రఫ్ లుక్ లో కనిపించబోతున్నారట మహేష్. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ లో ఫుల్ హెయిర్, చెవికి రింగు, రఫ్ గా కనిపించేలా గడ్డం, మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ లుక్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనకు తెలిసిన విషయమే.

హెయిర్ గ్రోత్ కోసం మహేష్ స్పెషల్ కేర్ తీసుకొని నేచురల్ గా కనిపించబోతున్నట్లుగా ఈ పోస్టర్ తో అందరికి అర్థం అయిపోయింది. గత కొంతకాలంగా మాస్ లుక్ కి దూరంగా ఉన్న మహేష్ ఈ సినిమాతో ఆ లోటును తీర్చబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ లో డైలాగ్ డెలివరీలో ఇంతకముందు చూడని వేరియేషన్ ని చూపించబోతున్నారట.

సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న సర్కారు వారి పాట పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనున్న విషయం అమె పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మరో పక్క ఎన్‌జె శ‌రవ‌ణ‌న్‌, ఆర్జే బాలాజీ‌ దర్శకత్వం వహిస్తున్న అమ్మోరు తల్లి సినిమా ట్రైలర్‌ని విజయదశమి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

ఆర్జే బాలాజీ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, నయనతారతో కలిసి నటించిన అమ్మోరు తల్లి మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మోరు తల్లి ట్రైలర్ షేర్ చేశారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌‌లో నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Share

Leave a Comment