రికార్డుల మోత మోగించిన

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు వరుస విజయాల తర్వాత చేస్తున్న అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి. లేటెస్ట్ గా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 27 వ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు యూనిట్ వర్గాలు.

సినిమా కి చాలా డిఫెరెంట్ గా సర్కారు వారి పాట అంటూ యూనిక్ టైటిల్ పెట్టగా టైటిల్ కి ఇన్స్టంట్ గా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ప్రీ లుక్ లో సూపర్‌స్టార్ మహేష్ న్యూ మేక్ ఓవర్ కూడా ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి.

ఇక టైటిల్ రిలీజ్ చేశారో లేదో ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా భారీ ట్రెండ్ ని సొంతం చేసుకోగా టాలీవుడ్ లో టైటిల్ ట్రెండ్స్ పరంగా కూడా సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ పాత రికార్డు లను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది సర్కారు వారి పాట ట్రెండ్.

24 గంటల్లో ఇది వరకు టైటిల్ ట్రెండ్ లో 3.5 మిలియన్ ట్వీట్స్ పడగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. ఊరమాస్ అనిపించే లెవల్ లో 24 గంటల్లో 4.4 మిలియన్స్ రేంజ్ లో ట్వీట్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టారు.

దాంతో టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి రాబోయే టైటిల్ ట్రెండ్స్ కి సరికొత్త టార్గెట్ ని సెట్ చేశారు, ఈ క్రమం లో ట్విట్టర్ లో మోస్ట్ రీట్వీటెడ్ అండ్ మోస్ట్ లైకుడ్ ఫస్ట్ లుక్ ఇన్ 24 హవర్స్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఈ పోస్టర్ లో మహేష్ పూర్తి లుక్ మాత్రం రివీల్ చేయలేదు. ఒక సైడ్ లో మాత్రమే పోస్టర్ లో మహేష్ ని చూపించారు. మహేష్ చెవి పొగుతో అలాగే మెడపై రూపాయి టాటూ వేసుకోవడం స్టైలిష్ గా ఉంది. రఫ్ గా కనిపించేలా గడ్డం, బ్లాక్ షర్ట్, ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీగానే కనిపిస్తున్నాడు.

వీటన్నిటికీ మించి టైటిల్ పరమార్థాన్ని ప్రతిబింబించేలా ఆ మెడపై రూపాయి కాయిన్ టాటూ దేనికో తెలియాల్సి ఉంది. ఈ మూవీకి ఆ పాయింట్ చాలా కీలకమైనదని భావించాల్సి ఉంటుంది. చూస్తుంటే మాస్ ఆడియెన్స్ ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యేలా ఉన్నారని అనిపిస్తోంది.

మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు.

ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని, అందుకే వదలకుండా దాన్నే పట్టుకున్నానని.. అది తనను వదలకుండా పట్టుకుందని చెప్పారు పరశురామ్. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, నవరసాలు ఉంటాయని వివరించారు.

Share

Leave a Comment