మ్యూజికల్ జర్నీ షురూ…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరుశురామ్ మహేష్ ని ఈ చిత్రంలో ఓ భిన్నమైన పాత్రలో ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుంది

ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో మొదలుపెడదామని ముందు భావించారు. మహేష్ పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా తొందరగా కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. కరోనా ఎఫెక్ట్ షూటింగులు వాయిదా పడ్డాయి

కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే షూటింగ్ ను మొదలుపెడదామని చిత్ర యూనిట్ అనుకుంటుందని సమాచారం. ఈ మూవ్ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 45 రోజుల పాటు అక్క‌డ షెడ్యూల్ ప్లాన్ చేశారని వినికిడి

అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు పరశురామ్ చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగునంగానే ఈ చిత్రానికి గల మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేసేయమన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే

నిన్న ఇదే విషయాన్ని థమన్ తన ట్విట్టర్ లో తెలియజేసారు. ఈ రోజు నుండి సర్కారు వారి పాట మ్యూజికల్ జర్నీ మొదలవనుంది. ఈ ప్రయానాన్ని ఒక సాంగ్ రికార్డింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అద్భుతమైన వాయిద్యబృందం మాతో పని చేస్తుంది. అభిమానులందరూ కోరుకునేలా ఈ అల్బమ్ సూపర్ గా ఉండబోతుంది

నాకు ఈ అవకాశాన్నిచ్చిన మన సూపర్‌స్టార్ మహేష్ కి, దర్శకులు పరశురాం గారికి నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసి, అభిమానులకు కిక్ ఇచ్చేలా ఇట్స్ షో టైమ్ అనే కాప్షన్ ను జతపరిచాడు థమన్. ఈ విషయం తెలుసుకుని మహేష్ అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు

షూటింగ్ కు వెళ్లే లోగా ట్యూన్స్ పూర్తైపోయి, సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోతే, షూటింగ్ కు చాలా వీలవుతుందని, సందర్భానికి తగినట్లుగా సాంగ్ షూటింగ్ చేసుకోవచ్చని, ఫాస్ట్ షెడ్యూల్స్ అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందని మహేష్ దర్శకుడితో చెప్పినట్లు తెలుస్తోంది

2020లో మహేష్ బాబు అందరికీ కంటే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో సరిలేరునికెవ్వరు సూపర్ హిట్టుగా నిలిచింది. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన సర్కారు వారి పాట మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది

అంతే కాదు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు జక్కన్న రాజమౌళి కాంబినేషన్ లో కూడా అతి త్వరలో సినిమాలు రాబోతున్నాయి సమాచారం. ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు

Share

Leave a Comment