అచ్చం మా అమ్మలాగే ఉంది

సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి త‌గినంత స‌మ‌యం కేటాయించ‌డం, పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబుకు అలవాటు. భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలతో సరదాగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు.

కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌కు సంబంధించిన విశేషాల‌ను కూడా మ‌హేష్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటారు. మహేష్ సాధారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయరు. కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావాల్సిందే.

కన్నపిల్లలు తమ అమ్మకో నాన్నకో ప్రతిరూపాల్లా ఉంటే ఆ ఆనందమే వేరు. మహేష్ బాబు తనకు కూతురు పుట్టినప్పటి ఉంచి అదే ఆనందంలో మునిగితేలుతున్నాడు. కూతురు సితారంటే అతనికి ఎంత ప్రేమో ఇప్పటికే మనందరికీ తెలుసు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రిన్స్ కూడా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాడు.

తాజాగా త‌న కూతురు సితార గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌హేష్ పోస్ట్ చేశారు. తన గారాలపట్టి సితార అచ్చం తన తల్లి ఇందిరా దేవిలాగే ఉందని మ‌హేష్‌ బాబు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. సితార ఫొటోను పంచుకుంటూ.. ‘పింక్‌.. గర్ల్‌ పవర్‌.. చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది’ అని పోస్ట్‌ చేశారు. దీంతో పాటు హార్ట్‌ సింబల్స్‌ను కూడా జత చేశారు.

దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ‌హేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకు లైకుల వ‌ర్షం కురుస్తోంది. మ‌హేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఫొటో పెట్టిన 15 గంటల్లోనే 1.08 లక్షల మంది లైక్‌ చేశారు. `సితార క్యూట్` అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

సితార-మహేష్ ల అనుబంధం ప్రేమ ఎప్పటికప్పుడు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నమ్రతా కూడా సితార గురించి పలు పోస్టులు చేస్తుంటుంది. ఏదేమైన ఇప్పటి నుండి సితారకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం విశేషం.

మ‌హేష్‌ ప్రస్తుతం ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు.

‘శ్రీమంతుడు’ వంటి హిట్‌ తర్వాత మ‌హేష్‌-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. ఏప్రిల్‌ 20న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత మ‌హేష్‌-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది.

Share

Leave a Comment