దక్షిణాదిన టాప్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధమ స్థానంలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటశేఖరుడు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు 26 సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.

టెక్నాలజీ విస్తృతమవడం, ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఈ ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.

46 ఏళ్ళ వయసులో కూడా అదే ఫిజిక్ మైంటైన్ చేస్తూ హాలీవుడ్ హీరోకి ఏమి తక్కువ కాదని మహేష్ నిరూపిస్తున్నాడు. ఇక మహేష్ బాబు కి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా అరుదైన ఫీట్ సాధించి దక్షిణాది తారల్లో టాప్ స్టార్‌గా నిలిచారు సూపర్ స్టార్.

సినిమా విషయాలతో పాటు ఫ్యామిలీ పర్సనల్ విషయాలు మరియు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలకు చేరువలో ఉంటారు మహేష్. ఈ క్రమంలో ఆయనకు సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్ గా మారిపోయారు.

దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లు దాటింది. అంటే మహేష్ కోటి కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడన్నమాట. దీంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన వ్యక్తిగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది.

మహేష్ కి దగ్గరలో ఫాలోవర్స్ కలిగిన హీరో లేడని చెప్పవచ్చు. కాగా ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా మహేష్ బాబు తర్వాత కమల్ హాసన్ 6.1 నాగార్జున మరియు రానా 6 రజనీకాంత్ 5.7 అల్లు అర్జున్ 4.7 జూనియర్ ఎన్టీఆర్ 4.2 విజయ్ 2.5 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నారు.

మహేష్‌ కి మాస్‌ నుంచి క్లాస్‌ వరకు, అమ్మాయిలు, ముసలివారు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులు ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది.

ఇక కెరీర్ పరంగాను కూడా మహేష్ బాబు దూకుడుగా వెళ్తున్నారు. భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేయనున్నారు.

Share

Leave a Comment