కొత్త బెంచ్ మార్కుని సెట్ చేసిన మహేష్

తెలుగు సినిమా హిట్ రేంజిని నిర్ణయించడంలో రెండు రాష్ట్రాల్లో వసూళ్ల తో పాటు ఓవర్సీస్ కలెక్షన్లు చాలా ఇంపార్టెంట్ గా మారాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత వసూలు చేసిందనే దానిని బట్టి సినిమా స్టామినా లెక్క కట్టేస్తున్నారు.

గత మూడేళ్లగా యూఎస్ లో 2 మిలియన్ వసూలు చేయడం అంటే అత్యంత అరుదైన రికార్డుగా అందరూ అనుకునేవారు. మూడేళ్ల లో ఐదు సినిమాలు మాత్రం ఈ అరుదైన్ ఫీట్ సాధించగలిగాయి. సూప‌ర్ స్టార్ సినిమాకు మంచి టాక్ రావాలే కానీ వసూళ్ల మోత మామూలుగా ఉండదు.

శ్రీమంతుడు తో తొలిసారి 2 మిలియన్ మార్క్ ను టాలివుడ్ కి పరిచయం చేసాడు సూపర్ స్టార్..ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ కు ఇది బెంచ్ మార్క్ గా ఉండేది. ప్రస్తుతం ఈ బెంచ్ మార్క్ మార్చాల్సిన టైం వచ్చేసింది.

ఇప్పుడు భరత్ అనే నేను తో 3.4 మిలియన్ మార్కు ని అందుకుని యూ.ఎస్. బాక్సాఫీస్ కి మకుటం లేని మహరాజు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నడు. ఈ క్రమంలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో మీరు కూడా చదివేయండి.


1.5 మిలియన్ సినిమాలు 5, 2.5 మిలియన్ సినిమాలు 2, 500కె+ ప్రీమియర్స్ సినిమాలు 5 ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ మాత్రమే. అసలు తెలుగు సినిమాకి మన బౌండరీల అవతల గుర్తింపు తెచ్చింది కూడా మహేషే .. మహేష్ కి అమెరికా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ సరిగ్గా ఆడని సినిమాలు సైతం అక్కడ కాసుల వర్షం కురిపించిన సందర్భాలు ఉన్నయి

ఈ ఏడాది ఇంతవరకు రిలీజైన నాలుగు తెలుగు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ల కలెక్షన్లు రాబట్టి ఈ ఫీట్ సాధించేశాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రంగస్థలం, భరత్ అనే నేను దాదాపు 3.5 మిలియన్ల కలెక్షన్లు సాధించాయి.

ఈ కలెక్షన్ల ట్రెండ్ గమనిస్తే మూడు మిలియన్ డాలర్లు వసూలు చేయగలిగితేనే ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ గా లెక్కేయాల్సి ఉంటుంది అని కొత్త బెంచ్ మార్కుని సూపర్ స్టార్ సెట్ చేసి మరో సారి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.

మొత్తం మీద 2018 తెలుగు రేంజిని పెంచింది. స్టామినా ఏమిటో చాటి చెప్పింది. ప్రేక్షకులను మెప్పిస్తే ఏ రేంజి కలెక్షన్లు సాధ్యమో ప్రూవ్ చేసింది. టాలీవుడ్ లో ముందు ముందు ఎన్ని సినిమాలు ఈ బెంచ్ మార్క్ టచ్ చేస్తాయో చూడాలి.

Share

Leave a Comment