మహేష్ ఖాతాలో అరుదైన ఘనత…

సూపర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్ల మంది డై హార్డ్ అభిమానులు మహేష్ బాబు సొంతం. ఆయన సినిమా రిలీజవుతుందంటే చాలు ఇంక బొమ్మ దద్దరిళ్లాల్సిందే. సినిమాలు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు రికార్డ్స్ బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తాయి

ఇక సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా అంతా ఇంతా కాదు. ట్విట్టర్ ఫేస్‌బుక్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు, తన ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకుంచూ ఉంటారు

సూపర్ స్టార్ కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ జన్మదినానికి అయినా, సినిమాలకు సంబంధించిన వేడుకల సమయంలోనైనా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో చేసే సందడితో రికార్డ్ స్థాయిలో ట్వీట్స్ నమోదవుతుంటాయి

ఫేస్‌బుక్ లోనూ సూపర్ స్టార్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే 10.9 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ ఇండియా హీరోల్లోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా మహేష్ బాబు రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించారు

తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మహేష్ బాబు మరో మైలురాయిని అందుకున్నాడు. అక్కడ మహేష్ బాబు అధికారిక అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య ఆరు మిలియన్లకు చేరుకుంది. ఇంతటి రేర్‌ ఫీట్‌ సాధించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

సూపర్ స్టార్ ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్ ను, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖషీ చేస్తున్నారు. అంతేకాదు సామాజిక అంశాలు, సహాయం చేయడం, అభినందలు తెలపడంలో సమాజిక మాధ్యమాలను బాగా వాడుతున్నారు

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది

పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ దీనితో మరో హ్యాట్రిక్ కు నాంది పలకడానికి రెడీగా ఉన్నారు

సర్కారు వారి పాట సినిమా తొందరగా కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. కరోనా ఎఫెక్ట్ షూటింగులు వాయిదా పడ్డాయి. అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు చెప్పినట్లు సమాచారం

Share

Leave a Comment