శ్రద్ధతో అంతః కరణ శుద్ధితో, ప్రామిస్

భరత్ అనే నేను..గత వారం రోజులుగా తెలుగు ఇండస్ట్రీని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో కళ కళలాడిస్తున్న చిత్రం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించి.. పర్ఫెక్ట్ పొలిటికల్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు.

అటు కలెక్షన్స్ పరంగాను మొదటి వారంలోనే 161 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సరికొత్త కొత్త రికార్డును సృష్టించింది. ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పే దృక్పథంతో బ్లాక్ బస్టర్ సీలెబ్రేషన్స్ వేడుకను నిర్వహించారు.

ఈ వేడుకలో మహేష్ మాట్లాడుతూ చాలా రోజులైపోయింది ఇలా షీల్డ్స్ ఇచ్చి, చాలా బాగా అనిపిస్తోంది. అమ్మగారి పుట్టిన రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నాన్నగారి పుట్టినరోజు మే 31 వరుకు షేర్స్ ఇలానే చెప్తుండాలి.

నాన్నగారి అభిమానులు నా అభిమానులు నన్ను సూపర్ స్టార్ అంటుంటారు. ఆ సూపర్ స్టార్ కి నాలుగేళ్లలో రెండు బ్లాక్ బస్టర్స్ ను కొరటాల శివ ఇచ్చారు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇలాగే శ్రద్ధతో అంతః కరణ శుద్ధితో సినిమాలు చేస్తుంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ఎంతో ఆనందంగా మాట్లాడరు.

‘‘దానయ్య గారు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు పూలు పూలు పూలు. దానయ్య గారు కలెక్షన్స్ అదిరిపోతున్నాయ్‌గా. అదిరిపోవా ఏంటి? అదిరిపోవాలి కదా..! మీ ఎనర్జీ ఇలాగే ఉండాలి దానయ్యగారు. ఇలానే గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పది రోజులుగా నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నాను. విజయవాడకు వెళ్లాను. తిరుపతికి వెళ్లాను. సినిమా రిలీజైన తర్వాత నన్ను పడుకోనివ్వకుండా చేస్తున్నారు శివగారు. ఈ రోజులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు కొరటాల శివ నుంచీ చాలా నేర్చుకున్నా. పోసాని, బెనర్జీ వంటి సీనియర్‌ ఆర్టిస్ట్‌లతో అసెంబ్లీ సీన్లు చేసొచ్చాక చాలా గర్వంగా అనిపించేది. ఈ సినిమా సక్సెస్‌తో చాలా ఆనందంగా ఉన్నాను.

శ్రీకర్ ప్రసాద్ గారి గురించి ఆయన ఎడిట్ చేస్తే సినిమా ఓ టెక్స్ట్ బుక్ లా ఉంటుంది. దేవి గురించి కొత్తగా చెప్పేదేమి లేదు ఆయన కమిట్మెంట్ ఆయన డెడికేషన్ ఇంకెవరిలో చూడలేదు. ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది.

నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ థ్యాంక్స్. నా రెస్పాన్సిబిలిటీని, మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోను. ఇలానే శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్యూ అందరికీ..’’ అని అన్నారు.

Share

Leave a Comment