కోట్లాది రూపాయలతో సిద్ధాపూర్‌ అభివృద్ధి

సూపర్‌స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ ప్రగతి పథంలో దూసుకువెళుతోంది. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దత్తతకు ముందు ఎవ్వరికీ తెలియని ఈ గ్రామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైంది. మహేష్ బాబుకు చెందిన ప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మహేష్ బాబు 2015 సెప్టెంబర్‌ 28న సిద్ధాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

దీంతో ఆయనకు చెందిన పలువురు ప్రముఖులు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విడతల వారీగా పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామశివారులో రూ. 1.50 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో అన్ని వసతులు, సౌకర్యాలతో నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

సిద్ధాపూర్‌ గ్రామం జాతీయ రహదారికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామ పంచాయతీకి చింతగట్టుతండా అనుబంధ గ్రామంగా ఉంది. గ్రామ జనాభా 2,274. ఓటర్లు 1624 మంది ఉండగా 678 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి పాడి పరిశ్రమ నిర్వాహణ. గ్రామంలో 70 శాతానికి పైగా ప్రజలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన సతీమణి రెండు పర్యాయాలు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. మహేష్‌బాబు కూడా ఎప్పటికప్పుడు గ్రామ సంగతులు తెలుసుకుంటూనే ఉంటారు.

మహేష్‌బాబు దత్తత తీసుకున్న తర్వాత గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాపూర్‌ సర్పంచ్ వడ్డె తులసమ్మ గారు మహేష్ తమ గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాల్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. మా గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు గారు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆయన సహకారం మరువలేనిది.

గ్రామం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు 1.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ట్రస్ట్‌ నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది అని ఆమె తెలిపారు. సిద్ధాపూర్‌ గ్రామంలో మహేష్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు అనేకం ఉన్నాయి. వాటి వివరాలను అమె తెయజేసారు.

* సిద్ధాపూర్‌తో పాటు పంచాయతీ పరిధిలోని చింతగట్టుతండాలో రూ.6 లక్షలతో రెండుచోట్ల బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు * గ్రామ సమీపంలో సుమారు రూ. కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పాఠశాల భవనాన్ని అత్యాధునిక సాంకేతికతో నిర్మిస్తున్నారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు.

* ఇప్పటికే గ్రామంలో రూ.20 లక్షలతో ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. * గ్రామంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా రూ.10.80 లక్షలు వెచ్చించి ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ ఎప్పటికప్పుడు డాక్టర్లతో ఊరి ప్రజలు ముఖ్యంగా పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.

* గ్రామంలో చాలా మంది పాడిపరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తుండడంతో పశువైద్యశాల నిర్మించాలని గ్రామస్థులు అభ్యర్థించారు. దీంతో రూ. 13 లక్షలు వెచ్చించి పశువైద్యశాల భవనాన్ని నిర్మించారు * ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం రూ. 5 లక్షలతో కంఫ్యూటర్‌ ల్యాబ్‌ను సిద్ధం చేశారు. కాగా త్వరలో ప్రారంభం కానుంది * పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.6 లక్షలతో పలుచోట్ల సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

ఇలా తమ గ్రామానికి ఎన్నో కార్యక్రమాలను చేసిన మహేష్ బాబు ను తాము ఎప్పటికీ మరిచిపోలేమని ఆయన ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవించాలని సిద్ధాపూర్‌ గ్రామస్థులు తెలియజేసారు. మ‌హేష్ బాబు రీల్ హీరోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నారు. తన సినిమాలతో సమాజానికి సందేశం ఇచ్చే మ‌హేష్ నిజ జీవితంలోనూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు.

రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది చెబుతారు. కానీ చెప్పింది చేసే వారు తక్కువే. కానీ తాను రెండో కోవలో ఉంటానని తన చేతలతోనే చేసి చూపించాడు ప్రిన్స్ మహేష్. ఈ రోజుల్లో చిన్న చిన్న పనులకే భారీ పబ్లిసిటీ కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు.

అలాంటిది మహేష్ బాబు ఇంతలా చేస్తున్నా పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు. చాలా తక్కువ మాట్లాడుతారు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లోనే తమ సత్తా ఏంటో చూపిస్తారు మహేష్. సినిమాల్లో కూడా అందమైన మనసున్న పాత్రలను ఎంచుకుంటాడు. వాటిలో మనిషితనం ఉంటుంది. మంచితనం ఉంటుంది. అసలైన హీరోయిజం ఉంటుంది. అవే మహేష్‌ను నిలబెట్టాయి.

ప్రేక్షకుల గుండెల్లో నిలబెట్టాయి. మహేష్ బాబు ని స్టార్‌ని చేశాయి. అంతకుమించి సూపర్‌ స్టార్‌ని చేశాయి. కిందపడిన ప్రతిసారీ మరింత పైకి లేచాడు. అంతకంతకూ ఎదిగాడు. తాను ఎక్కడైనా హీరోనే అనీ, మనసున్న హీరో అనీ నిరూపించుకున్నాడు. మంచి మనసున్న మన సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మరిన్ని విజయాలను సాధించాలనీ, ఎప్పుడైనా ఎక్కడైనా అలా హీరోలానే ఉండాలనీ కోరుకుందాం.

Share

Leave a Comment