ఫిదా చేసిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో తీరిక దొరికినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి.

అందుకే ఇంట్లోనే తన ఇద్దరి పిల్లలతో కలిసి సరదగా గడుపుతున్నారు మహేష్‌ బాబు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సితార‌తో క‌లిసి మ‌హేష్ చేసే హంగామా ఫ్యాన్స్‌కి అమితానందాన్ని క‌లిగిస్తుంది.

తాజాగా మహేష్‌, సితూ పాపని ఆడిస్తున్న ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తుంది. దీనిలో మ‌హేష్ పాట పాడుతూ ఓ టెడ్డీబేర్‌తో సితార‌ని తెగ న‌వ్విస్తున్నాడు. సితూ పాప ఆనందాన్ని చూసి తను తెగ మురిసిపోతున్నాడు. వీరిద్ద‌రి స‌ర‌దా ఆట‌ పాటల‌ని చూసి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.

ఈ మేరకు నమ్రతా వీడియోను షేర్ చేస్తూ ప్రేమ, జీవితం, హాస్యం మహేష్ బాబు సీతు పాప టెడ్డీతో ఆడుకుంటున్నారు. మహేష్‌లోని పసితనాన్ని ఆమె మాత్రమే బయటకు తీసుకురాగలదని క్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో టెడ్డీ బియర్ సాయంతో పాట పాడుతూ సితారాను నవ్వించే ప్రయత్నం చేశాడు మహేష్.

మెమోరీ థెరపీ పేరిట గతంలోని అందమైన క్షణాలను మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో రోజుకో వీడియో, ఫోటో, ఘటనను చెబుతూ మహేష్ బాబు, సితార, గౌతమ్‌ల గురించి ఫ్యాన్స్‌కు తెలిసేలా చేస్తోంది. ఇవి వైరల్ గా మారుతున్నాయి.

సితార మహేష్ బాబు పాటలకు, సినిమాలకు మాత్రమే కాలు కదుపుతుంది. కేవలం మహేష్ బాబు పాటలను మాత్రమే పాడుతుంది. ఖాళీగా ఉన్నా, కార్లో ఎక్కడికైనా వెళ్తున్నా మహేష్ పాటలను హమ్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య నమ్రత షేర్ చేసిన క్యూట్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

ఇక లాక్ డౌన్ సమయాన్ని ఈ ముగ్గురు వీడియో గేమ్‌లతో గడిపేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ సితార కలిసి గౌతమ్‌ను ఆటపట్టిస్తున్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. ఆటను గెలవడానికి కొడుకు ప్రయత్నిస్తూ ఉంటే కూతురు, తండ్రి మధ్యలో చెడగొడుతూ ఉంటే.

బుద్దిమంతుడైన నా కొడుకు వారిద్దరికి చిరునవ్వుతో లొంగిపోయాడు. ప్రేమతో ఒకరికొకరు. మీరు కూడా మీ విషయాలను చెప్పండ ని మహేష్ చేసే అల్లరిని నమ్రత ఫోటో రూపంలో బయటకు వదిలింది. ఆ ముగ్గురు కలిసి చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది నమత్ర.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Share

Leave a Comment