సందడి మొదలైంది

మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ కూతురు సితార చేసే అల్లరి అంతా ఇంతా కాదు. గౌతమ్ చాలా సైలెంట్ పర్సనే కానీ… సితార మాత్రం అల్లరి పిల్ల అని వారి సన్నిహితులు కూడా చెబుతుంటారు. ఇపుడు సితారకు మరో అల్లరి పిల్ల తోడైంది. ఆ పాప మరెవరో కాదు… వంశీపైడిపల్లి కూతురు ఆద్య.

‘మహర్షి’ మూవీ సమయంలో మహేష్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎక్కువగా సినిమా సెట్లో గడిపారు. ఈ క్రమంలో సితార, ఆద్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి సెట్లో చాలా సందడి చేసే వారని సినిమా యూనిట్ సభ్యులు చెబుతుండేవారు. ఇకపై సితార-ఆద్య కలిసి చేసే అల్లరి, సందడి మనం కూడా చూడొచ్చు.

ఇద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తమ ముద్దు ముద్దు మాటలు, ఆటలతో నెటిజన్లను అలరిస్తున్నారు. A &S అనే పేరుతో ఈ ఛానల్ మొదలైంది. ఇందులో ‘A’ అంటే ఆద్య. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు.

మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ ఛాలెంజ్’ పేరుతో ఓ వీడియోను తాజా పోస్ట్ చేశారు. తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు 3 మేకర్స్ చాలెంజ్ చేసి చూపించారు. ఈ ఛానల్ మొదలు పెట్టిన ఒక్కరోజులోనే వేల సంఖ్యలో వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ రావడం విశేషం. మహేష్ బాబు అభిమానులు ఈ ఇద్దరు చిన్నారులను విష్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సితార పిల్లలకు ఇష్టమయ్యే వినోదాన్ని అందించబోతోంది. ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఫన్నీ వీడియోలు, గేమ్స్, టాస్క్స్ ఇలా వివిధ రకాలుగా చిన్నపిల్లలని ఎంటర్టైన్ చేయనున్నారు.

స్టార్ హీరోలైన వారి పిల్ల క్రియేటివిటీని ప్రోత్సహించడంలో చాలా మంది ముందు ఉంటారు. ఆ వరుసలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు అందరికంటే ముందు ఉంటాడు. తన పిల్లలకి కావాల్సినంత ఫ్రీడం ఇచ్చే మహేష్ బాబు వారిని ప్రతి ఏడాదికి నచ్చిన చోటికి తీసుకెళ్ళి బెస్ట్ ఫాదర్ కూడా నిపించుకున్నాడు..

ఖాళీ సమయం దొరికితే పిల్లలతో స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపించే మహేష్ బాబు వారిలో టాలెంట్ ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. తన కూతురు సితారాలో టాలెంట్ ని అందరికి చూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి చిన్నారులకు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి మహేష్ బాబు విష్ చేయడంతో ఒక్కసారిగా ఆ వీడియోని ఎబ్భై వేల మంది చూసేసారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్ అవుతుంది. మరి ఈ ఛానెల్ ద్వారా సితార ఎంత హంగామా చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ కాగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.

తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నారని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు అనిల్ రావిపూడి. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను శెరవేగంగా షూట్ చేస్తున్నారు. కాశ్మీర్ షూట్ పూర్తవ్వగానే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుగుతుంది.

Share

Leave a Comment