సూపర్ ఫాదర్ డాటర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను సంతోషపెడుతూ ఉంటారు. అలానే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సితార పాప నవ్వుతూ ఉంది. వెనక ఉన్న అద్దంలో సితార ప్రతిబింబం కూడా కనిపిస్తోంది.

ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉంది. తాజాగా ఇదే ఫోటో ఎడిట్ వెర్షన్ ను ఈరోజు పోస్ట్ చేస్తూ ఈ ఎడిట్ చాలా నచ్చింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఫ్యాన్స్ ఎవరో నిన్న పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ ఫోటోను జోడించారు. వెనుక ఉన్న అద్దంలో మహేష్ ఫోటోను పెట్టడంతో నిజంగానే ఈ ఫోటో సూపర్ గా మారిపోయింది. మహేష్ సహజంగా షార్ట్ హెయిర్ స్టైల్ లో ఉంటారు.

కానీ అతిథి సినిమాలో మాత్రం ఇలా లాంగ్ హెయిర్ లో కనిపించారు. ఈ ఫోటోలో మహేష్ ఎలా నవ్వుతున్నాడో సితార పాప కూడా సరిగ్గా అలానే నవ్వుతోంది. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చ్చింది. కియారా అద్వాని లాంటి హీరోయిన్లు కూడా లైక్స్ కొట్టారు. మహేష్, నమత్రల కూతురిగా అతి చిన్న వయసులోనే తన ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకొంది సితార.

2)

అల్లరంతా సితార దగ్గరే ఉంటుంది. సితార మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. సితార చేసే అల్లరి, సితార ఆటపాటలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడూ మహేష్ లేదా నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సితార పాప సోషల్ మీడియాలో చాలా పాపులర్.

తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార సామాజిక మాధ్యమాల్లో చేసే సందడికి వీరాభిమానులున్నారు. సితార ప్రతి పండగకు చేసే సందడి మామూలుగా ఉండదు. వినాయక చవితి, క్రిస్మస్, సంక్రాంతి, దసరా పండగ ఏదైనా సితార చేసే సందడి ఆషామాషీగా ఉండదు. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

వాటికి విపరీత‌మైన రెస్పాన్స్ వ‌స్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహష్ సరసన హీరోయిన్ గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment