క్యూట్‌నెస్ అన్‌లిమిటెడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీ గా గడిపిన షూటింగ్ లో కాస్త ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీ తో కలిసి సమయాన్ని గడపటానికి ఇష్టపడుతుంటారు. ఇప్పటికే చాల సార్లు ఆలా ఫ్యామిలీ టూర్ కి వెళ్ళి పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇటీవల కూడా భరత్ అనే నేను చిత్ర సక్సెస్ తర్వాత కొన్ని రోజుల పాటు మహేష్ ఫ్యామిలీ తో స్పెయిన్‌‌ టూర్ వెళ్ళొచ్చాడు. తాజాగా మహేష్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. రీసెంట్‌గా మ‌హేష్ త‌న కూతురితో క‌లిసి ఆనందక్ష‌ణాల‌ని గడుపుతున్న వీడియో అది.

సితార ఎక్స్‌ప్రెష‌న్స్ తాను ట్రై చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు మన ప్రిన్స్ మహేష్ బాబు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నిన్న రాత్రి నుండి ట్రెండింగ్ లో ఉంది. క్యూట్‌నెస్ అన్‌లిమిటెడ్ అని నెటిజన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సూప‌ర్ స్టార్ మహేష్ త‌న‌య సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు స్టెప్పులేయ‌డ‌మే కాదు, డైలాగుల‌ను కూడా ముద్దుగా ముద్దుగా ప‌లుకుతుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ మూవీ షూటింగ్ లొకేష‌న్ కి వెళ్లి అక్కడ సితార చేసే సంద‌డి టీం మెంబ‌ర్స్ కి చాలా ఆనందాన్ని ఇస్తుంది.

ఇటీవల కొర‌టాల శివ తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను మూవీ సెట్స్‌కి కూడా వెళ్ళిన సితార అక్క‌డ ఫుల్ హంగామా చేయ‌డంతో పాటు యూనిట్ స‌భ్యుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. అసెంబ్లీ సెట్ లో సితార గడిపిన సమయాన్ని కూడా ఫ్యాన్స్ కోసం భరత్ అనే నేను అసెంబ్లీ మేకింగ్ వీడియో లో చూపించారు చిత్ర యూనిట్.

మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా కోసం డెహ్రాడూన్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

Share

Leave a Comment