ట్రెండ్ అవుతున్న

మహేష్ బాబు సూపర్ స్టార్ హీరోనే కాదు బాధ్యత గల తండ్రి కూడా. అందుకే తన పిల్లలను తీసుకుని ప్రతి ఏడాది సెలవులకు ఏదో ఒక దేశానికి వెకేషన్స్ స్పెండ్ చేయడానికి వెల్తాడు..ఏటేటా మాత్రమే కాదు.. అడపాదడపా షూటింగ్ మధ్యలో కొంత ఫ్రీ టైం దొరికినా కూడా కుటుంబంతో కలిసి విహార యాత్రలకి వెల్తుంటాడు.

తాజాగా మహేష్ తన భరత్ అనే నేను సినిమా విడుదల తరువాత భార్యా పిల్లలతో కలిసి స్పెయిన్ వీధుల్లో విహరిస్తున్నాడు. పిల్లలతో ఇలా క్వాలిటీ సమయాన్ని గడపడం లో ఎల్లప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ముందు వరుస లోనే ఉంటాడు.

మహేష్ సతీమణి నమ్రత గారు మహేష్ మూవీ షూటింగ్స్, పర్సనల్ అప్‌డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఓ ఫోటోను త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను మహేష్ అభిమానులు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.

ఆ ఫోటో స్పెషాలిటీ ఏంటంటే..స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ నగరం లో వీధుల్లో మహేష్ తన పిల్లలతో నడుచుకుంటు వెళ్తున్న ఫోటో అది. ఒక సాధరణ తండ్రి ల మహేష్ తన పిల్లల చేతులని పట్టుకుని నడిపిస్తూ ఉన్న ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

గౌతమ్, సితార మాడ్రిడ్ లో గడుపుతున్న ఆహ్లాదకర మొమెంట్స్ ని క్లిక్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో పెట్టారు నమ్రత. అవి వెంటనే వైరల్ గా మారి ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా స్పెయిన్ వీధుల్లో విహరిస్తూ అందమైన ప్రదేశాలలో ఫోటోలకి పోస్ ఇచ్చారు.

ప్రతీ ఏటా సమ్మర్ లో మాత్రం యూరోప్ టూర్ కచ్చితంగా వెళ్లడం వీరి ఆనవాయితీ. అయితే ఈ పిక్ లో మహేష్ ని బ్యాక్ సైడ్ నుండే ఫోటో తీసి అభిమానుల కోసం తన అకౌంట్ లో పోస్ట్ చేసారు నమ్రత. బహుసా మహేష్ కొత్త లుక్ అప్పుడే తెలియకూడదని ఇలా చేసుంటారు.

మహేష్ కు తన కొడుకు కూతురు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలు పుట్టాక అతడిలో చాలా మార్పు వచ్చింది. వాళ్లతో కలిసి తరచుగా వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రిన్స్. వాళ్లు తన స్ట్రెస్ బస్టర్స్ అని మహేష్ చెబుతుంటాడు.

Share

Leave a Comment