తొలిసారి అలా..!!

సూపర్‌ స్టార్ మహేష్ లాక్ డౌన్‌ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. సినిమా షూటింగ్‌ల మధ్య వచ్చే గ్యాప్‌లో కూడా ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు వెళ్లటం మహేష్ బాబుకు అలవాటు. ఇప్పుడు సుధీర్ఘ హాలీడే రావటంతో పూర్తి సమయం పిల్లలకే కేటాయించాడు.

గౌతమ్, సితారలతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా తను ఇంట్లో ఉంటున్న సమయంలో ఎలా టైం స్పెండ్ చేస్తాడు లాంటి విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఇటీవల సితార తో కలిసి టీవీ చూస్తున్న ఫోటోలు, గౌతమ్ తో కలిసి వీడియో గేమ్ లను ఆడుతు మహేష్ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ఫోటో ను షేర్ చేసింది నమ్రత శిరోద్కర్‌. ఇన్నేళ్ల కెరీర్‌ లో మహేష్ బాబు ఎప్పుడూ తెర మీద పూర్తిగా షర్ట్ లేకుండా కనిపించలేదు.

కేవలం వన్‌ నేనొక్కడినే సినిమాలో ఒక్కషాట్‌ లో మాత్రమే అలా కనిపించాడు. కానీ ఆ ఒక్క షాట్‌ కూడా మహేష్‌ను వెనుక నుంచి మాత్రమే చూపిస్తారు. అంతే అంతకు మించి ఏ సినిమాలో కూడా షర్ట్‌ విప్పి కనిపించలేదు మహేష్‌.

అయితే తెర మీద కాకపోయినా పర్సనల్‌ టైంలో మహేష్ షర్ట్ లేకుండా ఉన్న ఫోటో ఒకటి నమ్రత షేర్ చేసారు. మహేష్, కూతురు సితార‌తో కలిసి సరదాగా స్విమ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది నమ్రత. ఈ ఫోటోలో మహేష్ షర్ట్‌ లేకుండా ఉన్నాడు.

తొలిసారిగా సూపర్‌ స్టార్‌ను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఇంత ఫిట్ బాడీ ఉండి కూడా ఎందుకు మహేష్ సినిమాలో షర్ట్ లేకుండా చేయాడా అని ట్వీట్స్ పెట్టారు. మరి కొంత మంది అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది స్టార్టింగ్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు మహేష్. ఈ సినిమా తరువాత కరోనా ప్రభావం మొదలు కావటంతో తదుపరి చిత్రాన్ని
ఇంకా ప్రకటించలేదు మహేష్. సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ మేన్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు అంతకంటే యంగ్ గా కనిపిపిస్తున్నాడు. మహేశ్‌ తన తదుపరి చిత్రం పరుశురామ్‌ డైరెక్షన్‌లో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే కూల్‌గా, కాలేజీ స్టూడెంట్‌లా తన లుక్‌ను మార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Share

Leave a Comment