ఇన్స్‌ట్రుమెంటల్‌తో అదరగొట్టాడు

థిస్ ఈజ్ మీ అంటూ వచ్చిన సాంగ్ అఫ్ భరత్ ఎంత పాపులర్ అయిందో మనకందిరికీ తెలిసిన విషయమే. రికార్డుల మోత మోగించడమే కాకండా సూపర్‌స్టార్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ధి బెస్ట్ సాంగ్ గా నిలిచింది ఈ పాట.

దేవిశ్రీ ప్ర‌సాద్ ట్యూనింగ్ స‌రికొత్త‌గా అనిపించింది. ఇపుడు ఒక బుడతడు ఈ పాట ఇన్స్‌ట్రుమెంటల్ ని చక్కని రిథంతో సేమ్ టు సేమ్ గా కీబోర్డు మీద వాయించి అందరి మన్ననలను అందుకుంటున్నాడు. వైజాగ్ కి చెందిన ఈ అబ్బాయి టాలెంట్ చూసి నెటిజన్స్ అందరు పొగడ్తల తో ముంచెత్తుతున్నారు.

హోరుమనిపించే వాయిద్యాలు లేకుండా చాలా సింపుల్ గా క్యాచీ ఉన్న ఈ పాటలో మంచి ఫీల్ ఉండటంతో ప్రజాదరణ పొందింది. ఈ మధ్య కాలం లో వచ్చిన పాటల్లో ధి బెస్ట్ సాంగ్ ఇదే. అలాంటి పాట కి ఈ అబ్బాయి కవర్ వర్షన్ చేసి కేవలం కీబోర్డు మీద దానిని ఉన్నది ఉన్నట్టు పలికించిన విధానం ప్రశంసనీయం.

భరత్ అనే నేను సినిమా లోని ఈ పాట సౌండింగ్‌, మ్యూజిక్ ఇనిస్ట్రుమెంటేష‌న్‌, గాత్రం ఇవ‌న్నీ కొత్త‌గా అనిపించాయి. చాలా ఫ్రెష్ గా ఉండి కేవలం అభిమానులనే కాకుండా అందరిని ఇంప్రెస్స్ చేసింది. రేడియోలలో ఇప్పటికీ ప్రతి రోజు ఒక్కసారైన ప్లే చేస్టుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహేష్ అభిమానులకు ఈ పాట పండగలాంటిందే.

ప్రస్తుతం ఈ వీడియో ని అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. కామెంట్ల వర్షం తో ఈ అబ్బాయిని అభినందిస్తు తను ఫ్యూచర్ లో అధ్బుతమైన మ్యుసీషియన్ అవుతాడని ఖితాబు ఇస్తున్నారు. ఈ కాలం పిల్లలు ఎంత ప్రతిభావంతులో చెప్పడానికి ఇదొక ఉదాహరణ గ పరిగనించవచ్చు.

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2019 ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. సినిమా స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే విడుదల డేట్ ను ప్రకటించడం విశేషం.

అయితే ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. రవి పాత్రలో నరేష్‌ నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

Share

Leave a Comment