మహేష్‌ను దాటలేకపోయారు

మహేష్ బాబు, పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో అందరూ ప్రిన్స్, సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. చేసినవి 24 సినిమాలే అయినా ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మహేష్ తన ఖాతాలో మరో రికార్డును సొంతం చేసుకున్నారు.

మహేష్‌కు ప్రేక్షక హృదయాల్లో చాలా గొప్ప స్థానం ఉంది. ఓవర్సీస్‌లో అత్యధిక ఒక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల్లో ప్రథమస్థానాన్ని మహేష్ సొంతం చేసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకున్న సినిమాలు కూడా ఈ జాబితాలో ఉండటం ఓవర్సీస్‌లో మహేష్ క్రేజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి.

టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణ భారతదేశంలోని ఏ హీరోకు ఈ రికార్డు దక్కలేదు. మహేష్ తర్వాత ఆ స్థానాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ దక్కించుకున్నారు. ఆయన నటించిన ఏడు సినిమాలు ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను రాబట్టగలిగాయి. కాకపోతే రజనీకాంత్ అన్నీ బాషలు కలపగా మిలియన్ డాలర్లు వసూళ్ళు రాబట్టాయి.

కానీ మహేష్ మాత్రం కేవలం తెలుగు బాష తో మత్రమే మిలియన్ డాలర్లు రాబడతారు. ఓవర్సీస్‌లో ఫ్యామిలీ, థ్రిల్లర్, ప్రయోగాత్మక చిత్రాలకు వారు పెద్దపీట వేస్తుంటారు. మహేష్ ప్రతి సినిమా ఎదో ఒక కొత్త విధంగా ఉండేటట్లు చూసుకుంటారు. అందుకే ఓవర్సీస్‌లో మహేష్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది.

అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు దాటిన మహేష్ సినిమాలు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ మరియు భరత్‌ అనే నేను. ఈ సినిమాల్లో 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓవర్సీస్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి.

హాలీవుడ్ హీరోలకు సైతం ఏ మాత్రం తక్కువ కానీ లుక్స్ తో మైమరపించే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. దీంతో ఆయనను తమ బ్రాండ్లకు ప్రచారకర్తగా నియమించుకునేందుకు ఎన్నో దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తాయనడంలో సందేహం లేదు.

సెలెబ్రిటీల మార్కెట్ ను బట్టి, వారి పాపులారిటీని బట్టి టాప్ ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకుంటుంటాయి. బ్రాండ్ అంబాసిడర్ ఎండార్స్మెంట్ విషయంలో మహేష్ సౌత్ స్టార్స్ అందరికంటే ముందు ఉన్నారు. మహేష్ బాబు ఈ ఏడాది 15 బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే ప్రోడక్ట్స్ అంబాసిడర్ గా ఉంటూ మరోవైపు సినిమా నిర్మాణంలోను, మల్టీప్లెక్స్ థియేటర్స్ రంగంలోనూ బిజీగా ఉండటం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా సర్వేలు జరిపే డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ తమ రిపోర్ట్ ను విడుదల చేసింది. టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకునే దేశ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఈ ఫీల్డ్ లో మహేష్ లాంటి రీజనల్ స్టార్ పర్సనాలిటీ లీడ్ లో ఉండటం పెద్ద విశేషమే అని రీసెర్చ్ తెలిపింది.

టాప్ రీజనల్ సెలబ్రిటీస్ లిస్ట్ ని వారు ఎండోర్స్ చేసుకున్న బ్రాండ్స్ వాల్యూ ఆధరాంగా వెల్లడించారు. ఇందులో మహేష్ ఖాతాలో అత్యుత్తమంగా 15 బ్రాండ్స్ ఉండటం విశేషం. గతేడాది నవంబర్ కల్లా ఒక రీజియన్ వైజ్ 15 బ్రాండ్స్ మహేష్ ని తమ ప్రచారకర్తగా కొనసాగించడం అనేది సరికొత్త చరిత్ర. మునుపెన్నడు ఏ ఇతర సెలెబ్రిటీ ఇటువంటి ఘనత ని సాధించలేదు.

భరత్ అనే నేను భారీ హిట్ తర్వాత భారీగానే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉండాలని వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో కీలకమైంది. హీరోగా 25 వ చిత్రం కావడంతో కొత్త లుక్ తో మహేష్ అదరగొడుతున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా చేసేందుకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Share

Leave a Comment