బిగ్‌బీ కోసం మహేష్..

ఎంద‌రో న‌టీన‌టుల‌కు ఆద‌ర్శం, భారతీయ సినిమా దిగ్గజం, ఓ న‌ట శిఖ‌రం అమితాబ్ బచ్చన్. ఇండియ‌న్ సినిమాకి ఆయ‌న ఓ ట్రెండ్ సెట్ట‌ర్. నేడు అమితాబ్ 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో బాలీవుడ్ రారాజుకి ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

చలాకీతనం, నటనానైపుణ్యాలతో ఇప్పటికీ ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తున్న అమితాబ్ బ‌చ్చ‌న్ ఐదు ద‌శాబ్ధాలుగా త‌న సినిమాల‌తో అల‌రిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి చిరంజీవి, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు బిగ్ బీకు శుభాకాంక్ష‌లు తెలిపారు

లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీరు నాకే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మిలియ‌న్ల ప్రేక్ష‌కుల‌కు ప్రేర‌ణ‌. మీరు ఎల్ల‌ప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని
నేను కోరుకుంటున్నాను

మీ కార్య‌ద‌క్ష‌త‌తో మాకు, రానున్న త‌రాల‌కు స్పూర్తినిస్తూ ఉండండి. మీరు ఇలానే మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ ట్వీట్ చేశారు. అంతే కాదు, తాను బిగ్ బి తో ఉన్న పిక్ ఒకటి షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతుంది

బాలీవుడ్ పెహ‌న్ షా, మెగాస్టార్‌గా, ఐకానిక్ స్టార్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా ఇలా ఎన్నో బిరుదులు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ మెగాస్టార్ ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనేక పురస్కారాలను కైవసం చేసుకున్నారు

భారత ప్రభుత్వం బీగ్‌ బీకి 1984 లో పద్మశ్రీ, 2001 లో పద్మ భూషణ్, 2015 లో పద్మ విభూషణ్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 2018 లో నటదిగ్గజానికి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కూడా సత్కరించారు

అమితాబ్ బచ్చన్ తన కేరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. అందుకే ఆయన సినిమాలు వచ్చాయంటే అభిమానుల్లో పండుగ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. 78 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఎంతోమంది అగ్రనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు

ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం. దర్శకుడు పరుశురామ్ మహేష్ ని ఈ చిత్రంలో ఓ భిన్నమైన పాత్రలో ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుంది

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment