పూరీకి మహేష్ స్పెషల్ గా..

ఈ తరం దర్శకుల్లో టాలీవుడ్ లో అత్యంత స్పీడ్ గా సినిమాలు చేస్తే చేసే సత్తా ఉన్న దర్శకుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు పూరి జగన్నాథ్. డాషింగ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న పూరి జగన్నాథ్ సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి

పోకిరి సినిమాతో అటు హీరో గా సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటు తన రేంజ్‌ని పెంచేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌తో కలిసి బిజినెస్ మెన్ అనే చిత్రం చేశాడు పూరీ. ఈ మూవీ కూడా మంచి విజ‌యం సాధించింది

పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందించాల‌ని ప్లాన్ చేశాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న అది వ‌ర్కవుట్ కాలేదు. ఈ సినిమా విష‌యంలోనే మ‌హేష్‌, పూరీల మ‌ధ్య డిస్టెన్స్ కూడా పెరిగింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి

ఈ రోజు పూరీ జ‌గ‌న్నాథ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ విషెస్ తెలిపిన సూపర్ స్టార్ మ‌హేష్ బాబు పుకార్లుకు పులిస్టాప్ పెట్టాడు. పూరీని త‌ను ఎంత‌గానో అభిమానిస్తున్న‌ట్టు ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు. మహేష్ ట్వీట్ లో పూరి తన ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరని చెప్పడం విశేషం

నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని, మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు సూపర్ స్టార్ మ‌హేష్

మహేష్, పూరి మధ్య మనస్పర్థలు వున్నాయన్న పుకార్లకు మహేష్ ట్వీట్ చెక్ పెట్టింది. జ‌న‌గ‌ణ‌మ‌న పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాన‌ని అప్ప‌ట్లో అఫీషియ‌ల్‌గా పేర్కొన్నాడు. ఈ మూవీ పేట్రియాటిక్ సబ్జెక్టుతో పాన్ ఇండియా మూవీగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. ఈ సినిమా మహేష్ తో చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం పూరితో మరో మూవీ చేయాలని కోరుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి

పోకిరి ఇండస్ట్రీ హిట్ అందుకోగా, బిజినెస్ మెన్ సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు చిత్రాలలో మహేష్ మేనరిజాన్ని పూరి కొత్తగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు మా తరపున మీ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొని తెలుగు వారు గర్వించే సినిమా సినిమాలు నిర్మించాలని తెరకెక్కించాలని ఆశిస్తున్నాం. ప్రస్తుత దర్శకుల్లో సరిలేరు నీకెవ్వరు అంటూ పూరి జగన్నాధ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెప్తారు

Share

Leave a Comment