ఏదో మ్యాజిక్ ఉంటుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు చెబితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవడం ఎలాగూ పక్కా. అభిమానుల గుండెలు ఆనందంతో పొంగిపోతాయి. అమ్మాయిల హృదయాలు లబ్ డబ్ లబ్ డబ్ అని కాకుండా మహేష్.. మహేష్ అని కొట్టుకుంటాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను ఊచకోత కోసి సినిమాలను విజయతీరాలకు నడిపే సత్తావున్నవాడు సూపర్ స్టార్.

మహేష్ రూపంతోనే కాదు తన నటన, డైలాగ్ డెలవరీతో కూడా అదరగొట్టేస్తాడన్న సంగతి తెలిసిందే. మహేష్ పవర్ ఫుల్ డైలాగ్స్ మళ్లీ గుర్తు చేసుకుందాం. రాసింది రచయితే అయినా, వాటిని మహేష్ చెప్పే విధానంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే అవి పవర్ ఫుల్ పంచ్ ల్లా ఎప్పటికీ జనంలో నానుతూనే ఉంటాయి.

ఒకే ఒక్క పంచ్‌ డైలాగ్‌తో హీరో ఇమేజ్‌ను ఎక్కడో ఆకాశాన నిలబెట్టగల పూరీ జగన్నాథ్‌, మహేష్‌ కాంబినేషన్‌ ఒక సెన్సేషన్. అలా వాళ్లిద్దరూ కలిసి కొడితే బాక్సాఫీస్‌ దిమ్మ తిరిగిపోయింది. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మేజర్ గా ఆకట్టుకుంది ఎన్నడూ చూడని మహేష్ శైలి, డైలాగ్ డెలివరీ. ఇలా ప్రతిదీ కొత్తదిగా ఉంటుంది.

– ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను – ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు – ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా – స్టేషన్ లో కానిస్టేబుల్ అనుకున్నావా? మొన్న రెవాల్వర్ దొరికింది అన్నా కదా అది నాదే. అనవసరంగా పుట్టావ్, మీ నాన్న…. పద్మావతి హ్యాపీ ఆ, టైల్స్ వేస్తున్నారంటగా. రివాల్వర్ నాదే, శృతి నాదే. ఎప్పుడిస్తున్నావ్ నా రివాల్వర్.

అద్భుతమైన టాలెంట్‌ ఉన్న గుణశేఖర్‌ దగ్గర అంతే అద్భుతమైన స్క్రిప్ట్‌ ఒకటుంది. దానికి ఒక హీరో అవసరం పడింది. అప్పుడు అతని కళ్లూ మహేష్‌ బాబు వైపే చూశాయి. ఆ కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ప్రభావం ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది. అటు గుణశేఖర్‌నూ, ఇటు మహేష్‌నూ మాస్‌ ఆడియన్స్‌కు దగ్గర చేసింది.

– యుద్దం మొదలయ్యాక మధ్యలో వదిలేయడం మగతనం అనిపించుకోదు – తెల్ల డ్రెస్ వేసిన ప్రతోడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదు, పాత బస్తి – నేను ఈ ఊరు కబడ్డీ ఆడడానికి వచ్చాను. కానీ ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది, ఆడాల్సింది గ్రౌండ్ లో కాదు అని.

పూరీ విజన్ కి మహేష్ యాక్షన్ కలిసి బిజినెస్ మాన్ మూవీ ని ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమా ని చేసాయి. సూర్యా భాయ్ క్యారెక్టర్ లో మహేష్ పూర్తిగా లీనం అయిపోయి నటించారు. తన క్యారెక్టర్ లో 100% పరకాయ ప్రవేశం చేసి సూర్యా భాయ్ అనే క్యారెక్టర్ కు ఆటిట్యూడ్ ను ఒక సరికొత్త చిరునామా గా సెట్ చేసారు మహేష్.

– ఇలా రౌండప్ చేసి కన్ఫూజ్ చెయ్యోద్దు.. కన్ఫూజన్ లో ఇంకా ఎక్కువ కొట్టేస్తాను – నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్లు ఇళ్ళు చెప్పటేమే కానీ నాక్కుడా తెలీయదు – నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు, ముంబయిని ఉచ్చ పోయించటానికి వచ్చాను.

– జీవితం అనేది ఒక యుద్దం, దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు, బీ ఎలర్ట్, ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్.. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి, పాడలనుకుంతే కసి గా పాడెయ్యండి, చదవాలనుకుంతే కసి గా చదివేయండి, లైఫ్ లో ఏ గోల్ లేనొల్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోంది మీ వల్ల మకు ఏ ఉపయోగం లేధు.

గుర్తుపెట్టుకో నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ , నీకు ఏది అనిపిస్తే అది చేయ్, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ థి 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి..చల్. ఈ సన్నివేశం చూసాక గూస్‌బంప్స్ రానటువంటివారెవరు లేరు అంటే అతిశయోక్తి కాదు.

– మనం అందరం డిస్కవరీ చ్యానల్ చూస్తుటాం, పులి జింకని వెంటాడుతూ ఉంటుంది, ఆ విజువల్స్ చూస్తె ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జింక తప్పించుకోవాలి అని దేవుడికి మొక్కుకుంటారు, జింక తప్పించుకోగానే ఆనదం తో క్లాప్స్ కొడతారు, టీ.వి. కట్టేస్తారు. మనం మాత్రం కోడిని కోసుకుని బిర్యాని చేసుకుని తినేస్తాం. వీల్లకి ఆ కోడి మీద కాని, జింక మీద కాని జాలి ఉండదు. ఆ పులి అంటే కోపం. దాన్ని ఏమి పీకలేక జాలి కరుణ అని కబుర్లు చెప్తారు.

– సార్ ఇక్కడ ముంబయి లో ప్రతీ ఒక్కడికీ ఒక కల ఉంటుంది సార్. మీ కల నాకు నచ్చదు. నా కల మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కల కన్నా అది కల గానే మిగిలిపోతుంది సార్. బొక్క లో ఉన్న ఎలుకకే ఇంకో ఎలుక ఎక్కడుందో కనపడుతుంది సార్.

డైరెక్టర్ శ్రీను వైట్లతో మహేష్ బాబు చేసిన సినిమా దూకుడు. ఇందులో మహేష్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా కనిపిస్తూ విలన్ సోను సూద్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో ఈ డైలాగ్ వచ్చి మహేష్ స్టామినాని ఒక్క మాటలో చెప్పి కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ ని నమోదుచేసింది.

– దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిజ్ ఈజ్ ఆల్ టైం రికార్డ్ – భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది – నాకు ఒక్క నిముషం టైమిస్తే ఆలోచిస్తా, రెండు నిముషాలు టైమిస్తే యాక్షన్లో దిగుతా, మూడు నిముషాలు టైమిస్తే ముగించేస్తా – మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను.

– షేర్.. బబ్బర్ షేర్.. నేను నరకడం మొదలుపెడితే నరకంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి రా – కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు – ఒక్కొక్కడి బల్బులు పగిలి పోవాలి – ఈ దూకుడే లేకపోతే పోలీస్ మెన్ కీ పోస్ట్ మెన్ కి తేడా ఏముంటుంది

ఇలాంటి పంచ్ డైలాగులు చాలనే ఉన్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మహేష్ బాబు డైలాగ్స్ చెబుతుంటే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. డైలాగ్స్ చెప్పడంలో మహేష్ బాబే నెంబర్ వన్ అని చెప్పాల్సిందే. అంత మెస్మరైజింగ్ గా ఉంటాయి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు తో బిజీగా ఉన్నారు.

Share

Leave a Comment