సూపర్‌స్టార్ వచ్చేస్తున్నారు

సూపర్‌స్టార్ అభిమానులందరు మొన్న మహేష్ ని ముంబయి విమానాశ్రయం లో గెడ్డం తో చూసిన దెగ్గర నుండి ఎప్పుడెప్పుడు మరలా ఆయన్ని చూద్దామా అని ఎదురుచుస్తున్నారు. ఇక వారందరికి శుభవార్త. నేడు సూపర్‌స్టార్ తన కొత్త లుక్ తో స్టేజ్ మీదకి రాబొతున్నారు.

ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలకానున్నది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్‌బాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన ప్రధాన తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సుధీర్ బాబు, అదితిరావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెర‌కెక్కించిన చిత్రం సమ్మోహనం. ఇంద్రగంటి సినిమాలంటే ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని చూడొచ్చు. శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సినిమా ప్ర‌పంచానికి సంబంధించిన నేప‌థ్యంలో సాగ‌తుంది సమ్మోహనం. కృష్ణ గారి పుట్టిన రోజు (మే 31) సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల చేసారు మేక‌ర్స్‌. ఈ ట్రైల‌ర్‌తో చిత్రంపై భారీ అంచ‌నాలు పెరిగాయి. చిత్ర విడుదల నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 10న నిర్వహించనున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ అన్నింటికి పాజిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. మహేష్ రాక తో సినిమాకు మరింత బజ్ వస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక‌తో మ‌హేష్ న్యూ లుక్‌ ని అందరూ చూడొచ్చని అభిమానులు కూడా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు.

సినిమాలోని మాటలు, పాటలు, లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వినోదం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. జూన్‌ 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యుల కత్తెరకు ఎలాంటి పని చెప్పకుండా.. ఈ సినిమా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను పొందింది.

మహేష్ తన 25వ సినిమా కోసం డిఫరెంట్ ఛేంజోవర్ కోసం ట్రై చేస్తున్నారు. “టక్కరి దొంగ” అనంతరం మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించబోయేది ఈ సినిమాలోనే. కొత్త షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జూన్‌ 17న స్టార్ట్‌ కానుందట. డెహ్రాడూన్‌ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ మూడు రోజులు షూటింగ్‌ జరిపి, 21 నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కి షిఫ్ట్‌ అవుతారట చిత్రబృందం.

Share

Leave a Comment