హిందీ అభిమానులకి గ్రేట్ న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ మన ఇంట్లోకి మన అందరి ముందుకు రాబోతున్నాడు. మహేష్ ఏంటి మన ముందుకి ఏంటా అనుకుంటున్నారా? స్పైడర్ సినిమా గురించి అండీ. అదేంటి స్పైడ‌ర్ సినిమా టీవీల్లో వేయడం కూడా జరిగిపోయింది కదా. అప్పుడే ఇంకోసారి వేస్తున్నారా అనుకుంటున్నారా?

అవును, ఈ సినిమాను మ‌ళ్లీ టీవీల్లో వేస్తున్నారు. అది కూడా ఈ ఆదివార‌మే. రాత్రి 9.00 గంటలకి. అంటే జూన్ 17 అన్న‌మాట‌. కాక‌పోతే తెలుగులో కాదులెండి, ఇప్పుడు హిందీవాళ్ల‌కు ద‌ర్శ‌న‌మివ్వబోతున్నాడు సూప‌ర్ స్టార్. మహేష్ ని అభిమానించే హిందీ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్.

ఈ సినిమా ని హింది లో ఎప్పుడు చూడగలం అని అడిగే నార్త్ అభిమానులందరికీ సమాధానం దొరికింది. ఈ చిత్రాన్ని మురుగ‌దాస్ తెర‌కెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య ముఖ్య పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. జూన్ 17 రాత్రి 9.00 గంటలకి జీ సినిమా చానెల్ లో స్పైడ‌ర్ హిందీ ప్రీమియర్ రానుంది.

స్పైడర్ తమిళ టీవీ ప్రీమియర్ కు కూడ భారీ సందన వచ్చింది. భారీ రేట్ ఇచ్చి మ‌రీ స్పైడ‌ర్ తమిళ హ‌క్కులు తీసుకున్నారు స‌న్ నెట్ వ‌ర్క్. టీవీ టేఆర్పీ చరిత్ర లో అప్పుడు రికార్డుల మోత మోగించింది. ఇంతవరకు తమిళ్ వెర్షన్ లో తీసిన ఏ తెలుగు సినిమాకు రానంత భారీ స్థాయిలో 10.4 టిఆర్ పి రేటింగ్ తో స్పైడర్ ఏకంగా బాహుబలి 2నే క్రాస్ చేసి పారేసింది.

ఇక స్పైడర్ హిందీ టీవీ ప్రీమియర్ కు ఎలాంటి ఆదరన లభిస్తుందో వేచి చూడవలసిందే. కొన్ని సినిమాలు సిల్వర్ స్క్రీన్ లో ఒక మోస్తరు గా ఆడినా చిన్న స్క్రీన్ లో మాత్రం దుమ్ము దులుపుతాయి. మహేష్ సినిమాల లో ఇలా చాలా సార్లు జరిగాయి.

అతడు సినిమా టెలివిషన్ చరిత్ర లోనే సరికొత్త రికార్డులని క్రియేట్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొన్ని వందల సార్లు టెలికాస్ట్ చేసినా ‘మా’ ఛానల్ పదే పదే దీన్ని రెన్యువల్ చేసుకుంటూ నిర్మాత మురళీమోహన్ కు శాశ్వత ఆదాయవనరుగా మారింది. ఖలేజాది కూడా అదే పరిస్థితి. ఎప్పుడు వేసినా మినిమం టీఆర్పి రేటింగ్స్ దక్కుతున్నాయి.

Share

Leave a Comment