Mahesh Babu Spyder Pre Release Event

 

చిత్ర దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ – ”ఈరోజు నా లైఫ్‌లో చాలా ముఖ్యమైనరోజు. నేను మహేష్‌గారి సినిమా ఒక్కడుని విజయవాడలో చూశాను. సినిమా విడుదలై మూడు వారాలైన సినిమా హౌస్‌ఫుల్‌గా, పండుగలా అనిపించింది. నేను అప్పటి నుండి మహేష్‌ను కలిసినప్పుడల్లా నేను ఒక ఫ్యాన్‌ని. మీతో సినిమా చేయాలనుంది అని చెప్పాను. ఒక డైరెక్టర్‌కి మంచి బలం అంటే హీరోనే. స్పైడర్‌ ఎలా వచ్చిందని చాలా మంది అడుగారు. వారికి నేను చెప్పేదేంటంటే, స్పైడర్‌..మహేష్‌బాబుగారిలా వచ్చింది. స్టైల్‌గా, హ్యాండ్‌సమ్‌గా, డేడికేషన్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఓ ఏడాది జరిగిన షూటింగ్‌లో ఆరు నెలలు నైట్‌ షూటింగే చేశాను. ఏ రోజు కూడా సార్‌..నేను రేపు ఆలస్యంగా వస్తానని ఒక్కరోజు కూడా చెప్పలేదు. అంత కమిట్‌మెంట్‌ ఉన్న హీరో మహేష్‌. మహేష్‌బాబు డేడికేషన్‌కు ఈ సినిమా హిట్‌ను నేను ఆయనకు డేడికేట్‌ చేస్తాను. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో వర్క్‌ చేశాను. మహేష్‌లాంటి హీరోనెక్కడా చూడలేదు. మహేష్‌గారు లేకుండా ఈసినిమా సాధ్యమైయ్యేది కాదు. ఠాగూర్‌ సినిమా సమయంలో నుండి మధుగారితో పరిచయం ఉంది. సినిమా నిర్మాణం నుండి ప్రతి చిన్న విషయంలో ఎంతో కేర్‌ తీసుకున్నారు. సంతోష్‌ శివన్‌గారి వర్క్‌తో కొత్త మహేష్‌ను ఈ సినిమాలో చూస్తారు. హరీష్‌ జైరాజ్‌ సంగీతంలో పాటలు అల్రెడి హిట్‌ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ బ్లాక్‌ అదిరిపోతుంది. పీటర్‌ హెయిన్‌గారికి, శ్రీకర్‌గారికి థాంక్స్‌. నేను, ఎస్‌.జె.సూర్యగారు అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆయన హీరోగా కూడా సినిమాలు చేశారు. నేను అడగ్గానే నాకోసం విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారు. ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌ లండన్‌లో జరుగుతుంది. నా టీం ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. అందరికీ థాంక్స్‌” అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ – ”ఈ రోజు మా టీంకెంతో గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా వెయిట్‌ చేశాం. మురుగదాస్‌గారిని పదేళ్ల క్రితం పోకిరి సమయంలో కలిశాను. అప్పటి నుండి మేం ఇద్దరం సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆయనతో సినిమా చేయడానికి పదేళ్లు పట్టింది. నాకు మురుగదాస్‌గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసే కథలు, స్క్రీన్‌ప్లే, సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో పదేళ్ల తర్వాత సినిమా చేయడం నా అదృష్టం. ఈ కథను నాకు మా ఇంట్లో గంటన్నర పాటు ఎక్స్‌ప్లెయిన్‌ చేశారు. ఎక్స్‌ట్రార్డినరీ సీన్స్‌, ఫైట్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఎక్స్‌ట్రార్డినరీ థ్రిల్లర్‌ చేద్దామని, సినిమా చూసే ఆడియెన్స్‌ స్టన్‌ అయిపోవాలని అన్నారు. ఆడియెన్స్‌ ఏంటి? డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నేనే స్టన్‌ అయిపోయాను. ఒక బై లింగ్వువల్‌ సినిమా చేయడం జోక్‌ కాదు. మా అంత ప్రాపర్‌గా ఇప్పటి వరకు బై లింగ్వువల్‌ ఎవరూ చేయలేదేమో. ఒక షాట్‌ను తెలుగులో ఐదు సార్లు, తమిళంలో ఐదార్లు సార్లు చేయడం జోక్‌ కాదు. గ్రేట్‌ డైరెక్టర్‌ వల్లనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మురుగదాస్‌గారికి హ్యాట్సాఫ్‌. ఏడాదిన్నరగా ఆయనతో చేసిన జర్నీని మరచిపోలేను. పోకిరి సమయంలో మురుగదాస్‌గారిని కలిసినప్పుడు ఎలా ఉన్నారో అదే అట్యిట్యూడ్‌, సింప్లిసిటీతో ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. స్పైడర్‌లాంటి సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి. ప్యాషన్‌ ఉండాలి. మా మీద నమ్మకం పెట్టిన నిర్మాతలకు థాంక్స్‌. ఈసినిమాకు మేమెంత కష్టపడి పనిచేయాలో అంత కష్టపడి పనిచేశాం. సెప్టెంబర్‌ 27న స్పైడర్‌ను హిట్‌ చేసే బాధ్యత అభిమానులదే. సంతోష్‌ శివన్‌గారితో వర్క్‌ చేయడం గౌరవంగా ఉంది. మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు దళపతి, రోజా సినిమాలు చూసినప్పుడు పెద్దయ్యాక ఆయనతో సినిమాలు చేయాలనుకున్నాను. చాలాసార్లు ట్రై చేశాను. మురుగదాస్‌గారి వల్ల కుదిరింది. పీటర్‌మాస్టర్‌కి థాంక్స్‌. శోభిగారికి థాంక్స్‌. ఎస్‌.జె.సూర్యగారి దర్శకత్వంలో పనిచేశాను. ఇప్పుడు కోస్టార్‌గా కూడా పనిచేశాను. క్లైమాక్స్‌ షెడ్యూల్‌ చేయడం చాలా కష్టమైంది. నా కెరీర్‌లో అంత కష్టమని నాకెప్పుడూ అనిపించలేదు. ఇన్‌టెన్స్‌ షెడ్యూల్‌ అది. 2000 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాం. రకుల్‌ ఎంత బిజీగా ఉన్నా, డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి సపోర్ట్‌ చేసింది. సూర్యగారి ఎనర్జీ అసలు తగ్గనేలేదు. హరీష్‌జైరాజ్‌గారు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారని యూనిట్‌ అంతా నాకు చెప్పారు. సినిమా చూడటానికి నేను కూడా ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నాను. నేను ఒకసారి కథ ఒప్పుకుని చేస్తే, దానికి నేను ప్రాణం పెట్టేస్తాను. నాకు నా డైరెక్టర్‌ దేవునితో సమానం. అది నమ్మినందుకే ఒక అతడు, ఒక పోకిరి, ఒక శ్రీమంతుడు సినిమాలు వచ్చాయి. నేను అది నమ్మడం వల్లే ఇంతవాడినయ్యాను. మీలాంటి అభిమానులు నాకున్నారు. ఇలాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. ఎందుకంటే, నా సినిమా నచ్చితేనే నా అభిమానులు చూస్తారు. లేకుంటే చూడరు. మీరెప్పుడూ అలానే ఉండాలి. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. నాకు తమిళం మాట్లాడటం వచ్చినా, బయట మాట్లాడటం, సినిమాల్లో మాట్లాడటం వేర్వేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్‌ ఇచ్చి తమిళంలో డబ్బింగ్‌ చెప్పే అవకాశం కలిగించింది మురుగదాస్‌గారు. సెప్టెంబర్‌ 27న స్పైడర్‌ విడుదల కాబోతుంది. అన్నీ పండగల కన్నా ఈ పండుగను పెద్దగా కొట్టబోతున్నానని అనుకుంటున్నాం. అభిమానులు ఆశీస్సులు ఉంటుందని కోరుకుంటున్నాను“ అన్నారు.

Share

Leave a Comment