నార్త్ లో సూపర్ క్రేజ్

‘శ్రీమంతుడు’తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో కలిసి మరోసారి ‘భరత్ అనే నేను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరుగులేని విజయం అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలివుడ్ సినిమాల మార్కెట్ పరిధిని తెలుగు రాష్ట్రాల బోర్డర్ అవతల కూడా నిలబెట్టిన మొట్ట మొదటి తెలుగు హీరో మహేష్ అని చెప్పొచ్చు.

ఓవర్‌సీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ప్రిన్స్ సొంతం. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలో తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియా మార్కెట్లో లో ఈ మధ్య మన సౌత్ సినిమాల గురించి మాట్లాడేలా చేసిన హీరో మహేష్ బాబు.

యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మేడియా ప్లాట్ ఫాంస్ లో సూపర్ స్టార్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. భరత్ అనే నేను గురించి అనుకుంటున్నారా? లేదండి, శ్రీమంతుడు సినిమా లోని పాట ఇప్పుడు వైరల్ అయి కొత్త రికార్డులు స్రుష్టిస్తుంది.

అదేమిటి, ఎప్పుడో విడుదల అయిన శ్రీమంతుడు లోని పాట ఇప్పుడు వైరల్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అవును అండీ, ఫేస్ బుక్ లో ఒక నార్త్ ఇండియన్ పేజి లో మహేష్ బాబు శ్రీమంతుడు లో ని ‘జత కలిసే’ సాంగ్ కి హిందీ ఆడియో జోడించి పోస్ట్ చేసారు.

దానికి టోటల్ ఇండియా వైడ్ అధ్బుతమైన స్పందన లభించింది. విపరీతంగా షేర్ లు, లైక్ ల వర్షం కురుస్తుంది. సుమారుగా 3.5 కోట్ల (3,45,54,985) వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. అంతే కాదు ఈ వీడియో ని దాదాపు గా 1.1 మిలియన్ (1,077,219) మంది లైక్ చేసారు.

అసలు తెలుగు సినిమాల గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి సూపర్ గా ఉంది, మహేష్ బాబు అంటే మాకు కూడా ఇష్టం, ఈ సినిమా లింక్ ఇవ్వండి మేము కూడా చూస్తాం అని కామెంట్స్ పెడుతున్నారు. దీని బట్టి నార్త్ లో మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడే కాదు మహేష్ అంటే టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉంది. దటీజ్ సూపర్ స్టార్ మహేష్.

‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఈ వారంలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

Share

Leave a Comment