అండగా నిలబడిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.

తాజాగా మరో సాయం చేశారు. ఎన్నారై సేవ పేరుతో కొంతమంది ఎన్నారై లు ప్రతిరోజు మురికి వాడలకి వెళ్లి అక్కడ రోగాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 150 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమం గత ఆరేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. వీరి సేవ దృక్పథం మహేష్ బాబుని ఆకర్షించింది.

అందుకే ఆ ఫౌండేషన్ అథ్లెటిక్స్ కోసం అండగా నిలవాలనుకుంటే.. అందుకోసం అయ్యే మొత్తాన్ని భరించడానికి మహేష్, నమ్రతలు ఒకే చెప్పారు. ఫ్రీ స్పోర్ట్స్ రీహాబ్ ప్రోగ్రాం కి స్పాన్సర్ గా వ్యవహరించారు. దీని గురించి ఎన్నారై సేవ ఫౌండేషన్ ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ ఇలా చెప్పారు.

“కొన్ని నెలలుగా మహేష్, నమ్రత మాకు ఎంతో అండగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని భరత్ అనే నేను సినిమా రిలీజ్ సమయంలో బయటికి చెప్పవద్దని నాతో చెప్పారు. అలా చెప్తే అది సినిమా ప్రొమోషన్ కోసం చేసినట్లు అవుతుందని భావించారు.

ఆ మాటలోనే వారి మనసు నాకు అర్ధమయింది. చేసిన సాయం గురించి గొప్పలు చెప్పుకోవడం వాటిని తమ సినిమా ప్రమోషన్ కి వాడుకోవడం వారికి నచ్చదని ఈ సంఘటన స్పష్టం చేసింది. అయినా మంచి చేసిన వారి గురించి చెప్పకపోతే నాకు సంతృప్తి ఉండదు.

అందుకే బయటపెట్టాను. సాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి మహేష్, నమ్రత ఎంత బాధ్యత, ప్రేమతో సహకరిస్తారో చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. మహేష్ మా ఫౌండేషన్ కి అండగా నిలవడం గర్వంగా ఉంది” అని అన్నారు.

చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తాము చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయం. నిజంగా తను సూపర్ స్టార్ అని మహేష్ నిరూపించాడు.

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ ఫోకస్ నెక్స్ట్ మూవీపై పడింది. మహేష్ బాబు తదుపరి చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు.

Share

Leave a Comment