చెప్పినట్టే మహేష్‌ మాట నిలబెట్టుకున్నాడు

టాలీవుడ్‌లో ఇక హవా అంతా ‘మహేష్‌బాబు’ దేనని అందరు అంటున్నారు. మహేష్‌-కొరటాల శివ చిత్రం ‘భరత్‌ అనే నేను’ చిత్రంపై రాజమౌళి నుంచి పలువురు ప్రముఖులు వరకు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చిత్రాన్ని మొత్తాన్ని మహేష్‌ ఒంటి చేత్తో లాగాడని, ముఖ్యంగా ప్రెస్‌మీట్‌ సీన్‌లో ఆయన చిటికెలు వేస్తూ చేసిన నటనకు, ఆ సీన్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మహేష్‌ది ఎప్పుడు ఓపెన్‌ మైండ్‌తో ఉండే ఉద్దేశ్యం.

తన చిత్రం బాగా లేకపోతే ఈయన కూడా ఎలాంటి ఇగోలు లేకుండా దానిని ఒప్పుకుంటాడు. ఆ మధ్య మీడియాలో, మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో రివ్యూల పట్ల పలువురు ఆక్షేపించిన సమయంలో మహేష్‌ మీడియాను, రివ్యూలను బాగుంటే బాగుందని రాస్తారు. బాగా లేకపోతే బాగా లేదని రాస్తారు.

నేను కూడా రివ్యూలను ఫాలో అవుతుంటానని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ‘భరత్‌ అనే నేను’లో ఆయన మీడియా మీద వేసిన పంచ్‌లకు కూడా సోషల్‌ మీడియాలో మంచి మార్కులే పడుతున్నాయి.

ఇక ‘భరత్‌ అనే నేను’ మాస్టర్‌ పీస్‌ అని, ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ కొట్టనున్నామని మహేష్‌ తెలిపాడు. సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాత వెకేషన్స్‌కి కుటుంబంతో సహా వెళ్లే మహేష్‌ ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన వెకేషన్స్‌కి వెళ్లి వచ్చాడు.

తాను బ్లాక్‌ బస్టర్‌ కొట్టడం గ్యారంటీ అని, ఆ ఊపు, బజ్‌ తనకి కనిపిస్తున్నాయని ముందుగానే చెప్పాడు. ఇలా భరత్‌ మొత్తానికి తన చిత్రంపై ఉంచిన నమ్మకం ఆయన్ని విజయ కెరటాలలో ఉండేలా చేస్తోంది.

ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ, మీరంతా గర్వపడేలా చేస్తానని ముందు నుంచి చెబుతున్నాను. అనుకున్నట్లుగానే ఇచ్చిన మాటను నిలుపుకున్నాను. నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

ఇక ఇది మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మిమ్మల్ని గర్వపేడలా చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ‘భరత్‌ అనే నేను’ నాకిచ్చినందుకు కొరటాల గారికి థ్యాంక్స్‌ చెబుతున్నాను. ఈ సినిమా విజయం మా అందరి విక్టరీ. మొత్తం చిత్రం బృందానికి ధన్యవాదాలు. ‘భరత్‌ అనే నేను’పై మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశాడు.

Share

Leave a Comment