సూపర్‌ కాంప్లిమెంట్‌ కొట్టేసింది..!!

మహేష్‌ ఇంతవరకూ చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు. లేటెస్ట్‌గా ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక మహేష్‌బాబు జంట అందర్నీ ఆకట్టుకుంటోంది. హి ఈజ్‌ సో క్యూట్‌ అంటూ మహేష్‌ని పొగిడేస్తూ పాడిన పాటతో రష్మిక క్యూట్‌ అప్పీల్‌ యూత్‌కి కిర్రాక్‌ అనిపిస్తోంది.

అలాగే ఈ సినిమాలో రష్మికకు డాన్స్‌ చేసే అవకాశం కూడా కలిగింది. మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌లో రష్మిక డాన్స్‌ స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులు సైతం రష్మిక ని అభిమానించేంతగా ఆకట్టుకుంది. మహేష్ తో మరోసారి ఈ అల్లరి చలాకి పిల్లని చూడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

మహేశ్ బాబు కూతురు సితార, దర్శకుడు వంశీపైడిపల్లి కూతురు ఆధ్య కలిసి సూపర్ స్టార్ మహేశ్‌ బాబును ప్రత్యేక అతిథిగా తమ ఏ అండ్‌ ఎస్‌ యూట్యూబ్ చ్యానెల్ కోసం ఆహ్వానించి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మహేశ్ బాబును పలు ప్రశ్నలు అడిగారు. ఆ సందర్భం లోనే రష్మిక తన ఫేవరెట్ కోస్టార్ అని మహేష్ తెలిపాడు.

ప్రస్తుతం తనకు ఫేవరేట్‌ కో స్టార్‌ రష్మిక అని మహేష్‌ చెప్పడంతో అటూ రష్మిక ఇటు మహేష్ అభిమానులు సైతం ఎంతో ఆనందిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అంతటోడు తనను ఫేవరేట్‌ కో స్టార్‌ అంటే, రష్మికకు అంతకన్నా బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇంకేముంటుంది చెప్పండి. పట్టరాని ఆనందంతో భూమ్మీద నిలవలేకపోతోందట రష్మిక.

అసలే రష్మికకు సరిలేరు నీకెవ్వరు మూవీ ఓ స్పెషల్‌ మూవీ. తనను తాను కొత్తగా ఇన్వెంట్ చేసుకున్నానని అనేక ఇంటర్వ్యూలలో తెలిపింది. అందునా మహేష్‌తో కలిసి రష్మిక చేసిన ప్రమోషన్స్‌ కూడా వెరీ వెరీ స్పెషల్‌గా గా చెప్తూ వస్తుంది. ఈ సిట్యువేషన్‌లో మహేష్‌తో ఫేవరేట్‌ కో స్టార్‌ అనిపించుకుందంటే రష్మిక అదృష్టం మామూలుగా లేదనే చెప్పాలి.

ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్, యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఆద్య, సితార ఛానల్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసి తన సినిమా కెరీర్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం సరిలేరు నీకెవ్వరు ఎంచుకోవడం అని, అలానే సినిమా సక్సెస్ కు ముఖ్యకారకులు దర్శకులు అనిల్ రావిపూడి అని అన్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను మహేశ్ తన ట్విటర్ లో షేర్ చేశారు. చిన్నరులు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు మించిన సంతోషం నాకు ఏం ఉంటుంది. చిన్నారుల ఇద్దరికి నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి” అని వీడియోను మహేశ్ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు నుంచి వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు.

ప్రమోషన్స్ పూర్తి కావడంతో మహేష్ తన ఫ్యామిలి తో హాలిడే ట్రిప్ కు బయలుదేరారు. మహేష్ సతీమణి నమ్రత ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ఫోటోలను పోస్ట్ చేసారు.

Share

Leave a Comment