అభిమానులకి అదిరిపోయే సర్‌ప్రైజ్

తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించారు. ఈ హిట్ ఇచ్చిన జోష్ తో తన 25వ సినిమా చేస్తున్న మహేష్, మేక్ ఓవర్ తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

మ‌హేష్ అభిమానులు ర‌ఫ్ లుక్‌లో కూడా త‌మ హీరో అదిరిపోయాడ‌ని మురిసిపోతున్నారు. ఇప్పుడు అభిమానులకి మరో అదిరిపొయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు సూపర్‌స్టార్. మహేష్ తన న్యూ లుక్ తో శ్రీ సూర్య డెవలపర్స్ అనే కంపెనీ కి ఒక ఆడ్ చేసాడు. నేడు సదరు కంపెనీ వారు ఈ వీడియో ని విడుదల చేసారు.

ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన కొత్త లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు. రఫ్ లుక్ తో కూడా చాలా హుందాగా కనిపించాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు.

సినిమాల్లో నన్ను సూపర్‌స్టార్ చెసింది నా వాళ్ళు.. అంటే మీరు..మీ లైఫ్ లో మీరు కూడా సూపర్‌స్టార్ కావొచ్చు అని ఈ ఆడ్ కొనసాగుతుంది. ఒక సూపర్ ఆలోచన తో .. నా వాళ్ళు అనుకునే మీ అందరికి .. ఫర్ ట్రస్ట్ ఆండ్ వాల్యూ .. అని ఈ కంపెనీ గురించి సూపర్‌స్టార్ వివరించాడు.

ఈ ఆడ్ ని కూడా సూపర్‌స్టార్ తనదైన శైలి లో ముగించాడు. మీ ఫ్యూచర్ కి మీరే సూపర్‌స్టార్ అని మహేష్ చెప్పడం తో ఈ టీ.వీ.సి. ముగుస్తుంది. మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా యుంగ్ గా అందంగా కనిపిస్తున్నడు. ఇది చూసి అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

ప్రస్తుతం డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న తన 25వ సినిమాలో మహేష్ బాబు అర్ధ భాగం కాలేజి కుర్రాడు గెటప్ లో కనిపిస్తారట. కాలేజ్ కుర్రాడు గెటప్ కోసం తన రెగ్యులర్ లుక్ ని పూర్తిగా మార్చేసారు. మహేష్‌తో పాటు పూజా హెగ్డే, కీలక పాత్రధారి ‘అల్లరి’ నరేశ్‌ పాల్గొంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ ప్రఖ్యాత ఎడ్యుకేషన్ ఇంస్టిట్యూషన్ అయిన ఫారెస్ట్ రిసెర్చ్ ఇంస్టిట్యూట్ లో జరుగుతుంది. దీనినే ఐఐటి గా సినిమాలో చూపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు.

Share

Leave a Comment