సూర్యా భాయ్ అంటే

ప్రతీ ఇండస్ట్రీ లో గ్యాంగ్‌స్టర్ సినిమాలు చాలా ఆశక్తి రేపించేలా ఫుల్టూ యాక్షన్ ఆండ్ ఎలివేషన్స్ తో ఉంటాయి. హాలీవుడ్ కి గాడ్ ఫాధర్, బాలీవుడ్ కి సర్కార్ ఎలా ఐతే గ్యాంగ్‌స్టర్స్ గా ఆన్ స్క్రీన్ ని ఆడించారో, అలాగే మన టాలీవుడ్ ని కూడా ఒకడు రఫ్ ఆడేసాడు. అతనే సూర్యా భాయ్.

సూర్యా భాయ్ అంటే సాధా సీధా టైప్ కాదు ది మోస్ట్ హ్యాండ్‌సమ్ చార్మింగ్ గ్యాంగ్‌స్టర్ ఆఫ్ ది వరల్డ్. అందంతో పాటు తెలివి, తెగింపు ఉంది. అంతకు మించి ముంబయి ని దడదడ లాడించాడు. పూరీ జగన్నాథ్ ప్రతీ సినిమాకీ ఊహించని షాకులు ఇస్తాడని తెలుసు కానీ, ఇన్ని షాకులు ఇస్తాడని ప్రేక్షకులు ఊహించలేదు.

మహేష్ ఒంటిచేత్తో సినిమాని లాక్కొచ్చాడు. దర్శకుడు తనలోని ఆవేశాన్నీ, కసిని స్టోరీ లో పెట్టడం..మహేష్ దానిని ఇంత రఫ్‌గా చూపించడంతో బాక్సాఫీస్‌ దిమ్మ మరోసారి తిరిగిపోయింది. అందరినీ రఫ్ ఆడించిన ఆ సన్నివేశాలు మీకోసం మరొక్కసారి ఇక్కడ చూద్దాం…

* నేను మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి రాలేదు….ఈ ముంబైని ____ పోయించడానికి వచ్చా.. ఇండియాలో డబ్బుంది.. ఎవడికి వాడు కావాల్సింది తీసుకోవడమే..నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్పూర్తిగా కొట్టడం లేదు…

* ఇప్పటీదాకా పీకిన ప్రతోడు ఎక్కడినుంచో వచ్చిన వాడే .. ఇవ్వాల ముంబయి కి నేను వచ్చా.. దస్ దిన్ కే బాద్.. ఇదరీ మిలెంగే.. పార్టీ కరేంగే.. జెండా పాతేంగే.. ఇది రిక్వెస్ట్ కాదు, ఇట్స్ ఆన్ ఆర్డర్. గన్స్ డోంట్ నీడ్ ఎగ్రీమెంట్స్…

* మంచితనానికి రోజులు కావు సార్ ఇవి.. మంచోల్లని దేవుడు త్వరగా తీసుకెల్లిపోతాడు అంటారు..తీసుకెల్లిపోటం కాదు సార్..ఇక్కడ ఉన్నోల్లే పంపించేస్తారు.. ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ.. యుద్దం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు ..

* అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబ్స్ పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం, అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేను కూడా ఉన్నాను అని, అదే వినాయకుడు కాని రోజూ పాలు తాగితే ఇక్కడెవడూ పోయడు… ఈ సన్నివేశానికి ఈలలు చప్పట్ల గొలతో థియేటర్ దద్దరిల్లిపోయింది.

* రేయ్ మనం అందరం క్రిమినల్స్…క్రైమ్ చేసుకొనే బ్రతకాలి..నేను మీ అందరికి వర్క్ ఇస్తాను, ఎదవ ఈగోలు లేకుండా హ్యాపీగా పని చేసుకోండి.. నేను కొడితే అదోలా ఉంటుంది అని వాళ్లు వీళ్లు చెప్పటమే కాని నాకు కూడ తెలియదు…ఇప్పుడు మీకు తెలుస్తుంది..

* ఎవడి సినిమా ఆడిదే..ఆడి సినిమాలో ఆడే హీరో.. సార్..ఇక్కడ ముంబయి లో ప్రతీ ఒక్కడికీ ఒక కల ఉంటుంది సార్..మీ కల నాకు నచ్చదు.. నా కల మీకు నచ్చదు..అందుకే ప్రపంచం కోసం ఎవడు కల కన్నా అది కల గానే మిగిలిపోతుంది సార్…

* మనం అందరం డిస్కవరీ చ్యానల్ చూస్తుటాం, పులి జింకని వెంటాడుతూ ఉంటుంది, ఆ విజువల్స్ చూస్తె ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జింక తప్పించుకోవాలి అని దేవుడికి మొక్కుకుంటారు, జింక తప్పించుకోగానే ఆనదం తో క్లాప్స్ కొడతారు, టీ.వి. కట్టేస్తారు..మనం మాత్రం కోడీని కోసుకుని బిర్యాని చేసుకుని తినేస్తాం. వీల్లకి ఆ కోది మీద కాని, జింక మీద కాని జాలి ఉండదు, ఆ పులి అంటే కోపం, దన్ని ఏమి పీకలేక జాలి కరున అని కబుర్లు చెప్తారు..మనుషులు కదా అందుకే మానవత్వం గురుంచి మాట్లడుతున్నారు

* జీవితం అనేది ఒక యుద్దం, దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు, బీ ఎలర్ట్, ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్.. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి, పాడలనుకుంతే కసి గా పాడెయ్యండి, చదవాలనుకుంతే కసి గా చదివేయండి, లైఫ్ లో ఏ గోల్ లేనొల్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోంది మీ వల్ల మకు ఏ ఉపయోగం లేధు.

* గుర్తుపెట్టుకో…నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ, నీకు ఏది అనిపిస్తే అది చేయ్, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ థి 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి..చల్.. ఈ సన్నివేశం చూసాక గూస్‌బంప్స్ రానటువంటివారెవరు లేరు అంటే అతిశయోక్తి కాదు.

* ఇలా రౌండప్ చేసి కంఫ్యూజ్ చేయొద్దు..ఎందుకంటే కంఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా …* ప్రతీ కుక్క ఒక రోజు మొరుగుద్ది..ఈ రోజు నేను మొరిగాను.. రెండు కోట్ల కార్ గిఫ్ట్ ఇస్తే, ఎవత్తయినా ఐ లవ్ యూ చెప్పుద్ది.. ఈ సీన్ కి థియేటర్ టాప్ లేచీపోయే అంత విజిల్స్ పడ్డాయి..

* ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు.. అందులో సగం మంది ప్రతీ రోజు సముద్రం లో చేపలు పట్టుకుని తినేస్తారు..ఉడక పెట్టుకుని, వేపుకుని, ఎండబెట్టుకుని..పులుసంటారు..ఫ్రై అంటారు..నువ్వేమంటున్నావ్ టూనా ఫిష్ అంటున్నావ్..ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కొట్ల చేపలు మీరు తినేస్తే పెద్ద మ్యాటర్ కాదు..

* ఎప్పుడైన ఒక చేప కాని ఒక మనిషిని కాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు గా..ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరినైనా బీచ్ లో కొద్దిగా కొరికితే చాలు..ప్రపంచం లో ఉన్న అన్ని న్యూస్ చ్యానెల్స్ లో వేసేస్తారు..జాస్ 1,2,3 సినిమాలు తీసేస్తారా మీరు.. మీయేనా ప్రాణాలు..వాల్లవి కాదా.. ఎదవ కబుర్లు చెప్తుంది.. ఎదవ కబుర్లు ..

సూర్య భాయి ని ఎలివేట్ చేసే డైలాగ్స్ ఎన్ని ఉన్నాయో, తన ద్వారా చూసే జనాలను ప్రభావితం అయ్యే విదంగా చెప్పిన నిజాలు అన్నీ ఉన్నాయి. భాయ్ లకే కొత్త అర్ధం చెప్పిన భాయ్ బిజినెస్‌మాన్ సూర్యా భాయ్. నెగటివ్ రోల్ తో కూడిన పాజిటివ్ ఎలిమెంట్స్ పుష్కలంగా చూపించిన పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో చెప్పించిన డైలాగ్స్ గట్టిగా పేలాయి.

అప్పటివరకూ హీరోయిజం అంటే ఇదే అనుకునే అందరూ నోరు తెరిచి చూసే విధంగా హీరోయిజం ఇలా కూడా ఉంటుంది అని చాటి చెప్పారు.. ఈ సినిమా ను పూరి గారు పైకి ఏదో గ్యాంగ్‌స్టర్ సినిమా గా కనిపించేటట్లు తీసారు కాని, సూర్య భాయ్ ద్వారా ఎన్నో నిజాలు, తనదైన బోల్డ్ వే లో చెప్పించారు.

Share

Leave a Comment