ఆ వార్తలు నిజం కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ షూటింగ్‌‌లో బిజీగా గడుపుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో షూటింగ్, ప్రోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

స్టార్స్ అంటే రూమర్స్ రావడం చాలా సహజం. ఎక్కడ ఏది జరిగినా ఏదో ఒక లింక్ తో పలువురు హీరోలకు లింక్ పెట్టేస్తుంటారు. ఇఫ్పుడు మహేష్ బాబుపై కూడా అలాంటి రూమరే ఒకటి వచ్చింది.

ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో మహేష్ ట్రిప్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. బెజవాడలో జరిగే నావీ షోకు మహేష్ హాజరు కానున్నాడని ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఇలాంటిదేమీ లేదంటూ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనబోవడం లేదట. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కు సంబంధించిన వెబ్ వ్యవహారాలు చూసుకునే టీం అధికారికంగానే క్లారిటీ ఇచ్చింది.

మహేష్ బాబు ఏ ఈవెంటుకు హాజురు కావడం లేదని, ఆ వార్తలు నిజం కాదని తెలిపారు. ఇందుకు కారణాలు కూడా చెప్పడం చెప్పుకోవాల్సిన విషయం.

ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న కారణంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అంటున్నారు. ప్రస్తుతం భరత్ అనే నేను మూవీని ఫినిష్ చేయడంలో మహేష్ చాలా బిజీగా ఉన్నాడు.

ఇంకా షూటింగ్ పార్ట్ కూడా కొంత పెండింగ్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం షూటింగులో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారని తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో యూనిట్ పని చేస్తోందన్నారు.

మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఏ పనులు డిలే అయినా ఔట్ పుట్ తేడా వచ్చేస్తుంది. అందుకే భరత్ అనే నేను మూవీ గురించి తప్ప మరేదీ పట్టించుకునే పరిస్థితిలో లేడట సూపర్ స్టార్ మహేష్.

‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు చేయని సరికొత్త పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు సూపర్ స్టార్. ఇటీవల విడుదలైన టీజర్‌ ది విజన్ ఆఫ్ భరత్ కు అపూర్వ స్పందన వస్తోంది.

Share

Leave a Comment