ముఖ్య అతిధి గా రానున్నారా

సొంత బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించడమే గాకా సుధీర్ బాబు తనే హీరో గా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ ఈ మధ్యనే విడుదలైంది. విడుదలయిన రోజు నుండి సినిమాకు పాజిటివ్ టాక్ ఆండ్ ఎంకరేజింగ్ రివ్యూస్ ఉండడం వలన కలెక్షన్స్ స్టెడీ గా ఉన్నాయి.

దీంతో ‘నన్ను దోచుకుందువటే’ మేకర్స్ సక్సెస్ మీట్ జరిపి సినిమాకు బజ్ పెంచే ప్రయత్నాలలో ఉన్నారట. ఇక ఇలాంటి ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తే అందరి దృష్టిని సినిమా పైకి మళ్లడమే కాకుండా మరింత పాజిటివ్ బజ్ యాడ్ అవుతుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు.

ఎలాగూ ఈ సినిమాకు సంబంధించిన ఇతర ఈవెంట్స్ కు మహేష్ హాజరుకాలేదు కాబట్టి సక్సెస్ మీట్ కు మహేష్ ని ఆహ్వానించాలని.. సినిమా గురించి ఇదివరకే పాజిటివ్ గా స్పందించిన మహేష్ ఇప్పుడు నాలుగు మంచిమాటలు చెప్తే అభిమానులు మరింత ఆనందిస్తారు అని చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో సక్సెస్ మీట్ కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారట.

సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి మహేష్ వచ్చి కొంచం బూస్ట్ అప్ చేస్తే సెకండ్ వీక్ కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశముందని మరియు తమ అభిమాన హీరో ని డైరెక్ట్ గా చూడొచ్చని మహేష్ బాబు అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభాకు మంచి పేరు రావడమే కాదు పెద్ద పెద్ద సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.

ఘన విజయం సాధించిన సందర్భంగా జరిగిన చిట్ చాట్ లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు గురించి నభా నటేష్ ‘మహేష్ సర్ కి నేను పెద్ద అభిమానిని. మహేష్ సర్ సూపర్ చార్మింగ్. నేను బెంగళూరుకి చెందిన అమ్మాయిని, ఇక్కడ అందరికి మహేష్ సర్ తెలుసు..ఎవ్రీ గర్ల్ హాస్ ఫాలెన్ ఫర్ మహేష్ సర్. ఆయనంటే ఇక్కడి అమ్మాయిలకు చాలా ఇష్టం’ అని చెప్పారు.

సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి సినిమాతోనే ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇదే హుషారులో సుధీర్ బాబు తదుపరి మరింతమంది కొత్త కుర్రాళ్లను ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం సినీ విమర్శకులను సైతం మెప్పించింది.

Share

Leave a Comment