సూపర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా…

జాతీయ అవార్డు సాధించిన షో సినిమాతో నటిగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల తరువాత నిర్మాతగా కూడా తన మార్క్ చూపించారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోదరి మంజుల తొలిసారి మ‌న‌సుకు న‌చ్చింది అనే చిత్రంతో మెగా ఫోన్ ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరో హీరోయిన్లుగా స్వీయ నిర్మాణంలో మనసుకు నచ్చింది సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కథ కూడా ఆమెదే. మంజుల చేసిన ఈ ప్రయత్నాన్ని మరింత ప్రోత్సహించడానికి రెడీ అయ్యాడు మహేష్.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీకి మరింత ప్రచారాన్ని కల్పించేందుకు “మనసుకు నచ్చింది” ట్రయిలర్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు లాంచ్ చేయబోతున్నాడు మహేష్.

ఈ చిత్ర పోస్ట‌ర్, టీజ‌ర్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రిప‌బ్లిక్ డే శుభాకాంక్ష‌ల‌తో జ‌న‌వ‌రి 26, 2018న చిత్రం విడుద‌ల కానుంది.

ఈ చిత్రానికి ర‌త‌న్ సంగీతం అందించ‌గా, త్వ‌ర‌లోనే పాటల‌ని విడుద‌ల చేయ‌నున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు.

మంజుల కూతురు జాన్వీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, మ‌న‌సుకు న‌చ్చింది చిత్రం జాన్వీ డెబ్యూ మూవీ కానుంది.

గతంలో నటిగా ‘ఆరెంజ్‌’, కావ్యాస్‌ డైరీ’ తదితర చిత్రాల్లో నటించింది మంజుల. నటన ఆమెకు సంతృప్తినివ్వలేదట. నిర్మాతగానూ పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించింది.

అవి కూడా ఆమెకు సంతృప్తినివ్వలేదట. దర్శకురాలిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమనీ చెబుతోంది.

క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మంజుల నమ్మకం వ్యక్తం చేస్తోంది.

Share

Leave a Comment