మెస్మరైజ్ చేయనున్న మహేష్

శ్రీమంతుడు రిలీజ్ కి ముందే బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే స్పైడర్, ఆ స్పైడర్ విడుదల లేట్ అవుతుండడంతో “భరత్ అనే నేను” సినిమాల షూటింగ్ లో పాల్గొని మినిమం గ్యాప్ లేకుండా సదరు సినిమాలను ఫినిష్ చేసిన మహేష్ తన 25వ చిత్రం షూటింగ్ ని వచ్చే నెలలో మొదలు పెట్టనున్నాడు.

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు మహేష్ బాబు. అయితే భరత్ అనే నేను లో మోస్ట్ స్టైలిష్ సీఎం గా కనిపించిన మహేష్ బాబు ఇక నుండి సరికొత్త లుక్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు.

ఇప్పటికే 2 సినిమాలను లైనప్ చేసుకున్న మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సుకుమార్ తో సెట్స్ పై ఉంటాడు. సుకుమార్ సినిమాలో మహేష్ అల్ట్రా అర్బన్ లుక్స్ లో కనిపించనున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అందుకే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం వంశీ సినిమాలో మహేష్ బాబు లుక్స్ పైనే ఫిక్సయింది.

ఇప్పటికే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి పూర్తి చేసిన వంశీ పైడిపల్లి అండ్ టీమ్, ప్రస్తుతం ఫోకస్ మొత్తం మహేష్ బాబు లుక్స్ పైనే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్తగా కనిపిస్తాడని కొందరు ఎక్స్ పెక్ట్ చేస్తుంటే, కంప్లీట్ గా డిఫెరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తాడని మరికొందరు గెస్ చేస్తున్నారు.

భరత్‌ అనే నేను తర్వాత విదేశాలకి ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లిన మహేష్‌ ఇంకా తిరిగి రాలేదు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ చిత్రంలో ప్రత్యేక లుక్‌ కోసం కసరత్తులు చేయనున్నారు మహేష్‌. ఈ లుక్‌తో ఈ సినిమా లో ఇంకా యంగ్‌గా కనిపించబోతున్నారట మన సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.

అసలే మహేష్ బాబు కి ఇది 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మరి వంశీ మైండ్ లో మహేష్ బాబు లుక్స్ ఎలా ఫిక్సయి ఉన్నాయో ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ప్ర‌తి సినిమాని విల‌క్ష‌ణ‌మైన క‌థాంశంతోనే తెరకెక్కించే సుకుమార్. ప్ర‌స్తుతం మ‌హేష్ 26 కోసం క‌థ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త‌న‌దైన శైలిలో వైవిధ్యంగా ఉండేందుకు క‌థ‌లో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

త‌న అసోసియేట్ ఒక‌రు వినిపించిన లైన్ ఎంతో బాగా న‌చ్చిందిట‌. ఆ లైన్‌ను ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్టుగా త‌యారు చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి… 2019లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌.

Share

Leave a Comment