సూపర్‌స్టార్ కోసం సూపర్‌స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ఏ ఆర్ మురుగదాస్ ల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దర్బార్. రజనీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగుల కలబోతగా మురుగదాస్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్ విషయంలో చేస్తున్న హంగామా చూస్తుంటే మతి చెడాల్సిందే.

ఈ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియాలో స్టార్ హీరోలు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు దర్బార్ మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. నేటి సాయంత్రం 5:30 గంటలకు మహేష్ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేస్తారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

దర్బార్ హిందీ పోస్టర్ ని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేస్తుండగా మలయాళంకి సంబందించిన పోస్టర్ ని మోహన్ లాల్ రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళ్ కి సంబంధించి కమల్ హాసన్ సరిగ్గా అదే సమయానికి రిలీజ్ చేస్తారు. ఈ విషయాన్నీ లైకా సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అనౌన్స్ చేసారు. సో మోషన్ పోస్టర్స్ తో సూపర్ స్టార్ దర్బార్ సందడి మొదలు కానుందన్నమాట.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి పోటీపడనుండటం విశేషం. తనతో పోటికి వస్తున్న సినిమాకు మహేష్ ప్రచారం చేయడం విశేషమే. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ స్పైడర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ స్నేహంతో మహేష్ ఈ సినిమాకు ప్రచారం చేస్తుండొచ్చు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతుంది నటిస్తున్నారు. ఈ సినిమాతో లేడీ బాస్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు జోడీగా విజయశాంతి నటించిన సమయంలో మహేష్ బాబు బాలనటుడు. దీంతో ఇప్పుడు మహేష్ బాబు, విజయశాంతి కాంబినేషన్ సీన్లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మహేష్ బాబు విజయశాంతిని ఎంతో గౌరవిస్తారు. ఈ విషయం విజయశాంతి గారు ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. మహేష్ సెట్ లో తనను మేడమ్ అని.. అమ్మా అని పిలుస్తారని చెప్పారు. ఇక విజయశాంతి మహేష్ ను బాబు అని పిలుస్తారని కూడా చెప్పారు. షూటింగ్ లొకేషన్ లో ఇలాంటి అందమైన వాతావరణం ఉండడం అవుట్ పుట్ పై ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని భావించవచ్చు.

సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలం గ్యాప్ తర్వాత మహేష్ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది.

అనిల్ రావిపూడి యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నాడట. సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా అలరించే విధంగా ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ఉంటుందట. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో కూడా టైటిల్ కు తగ్గట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.

Share

Leave a Comment