పండగ బ్రేక్ లేదు

ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాలకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌ అనుకునేరు. ఇప్పట్లో నో హాలిడేస్‌, ఓన్లీ షూటింగ్‌ అనేలా తాజా చిత్రం ‘మహర్షి’కి మహేష్ బాబు డేట్స్‌ ఇచ్చారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్‌ రాజు, పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో మహేష్ బాబు కొన్ని సీన్స్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. వినాయక చవితి నాడు కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తారట. సో పండగ సెలవు లేనట్లే. నెలాఖరున మరో షెడ్యూల్‌ కోసం విదేశాలు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఓ వైపు 25వ సినిమా షూటింగ్ మరోవైపు యాడ్ లతో బిజీబిజీగా గడుపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓ యాడ్ లో మిస్టర్ కూల్ లా వైట్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. కాగా ఈ యాడ్ లో మహేష్ బాబు వెనక, కొరటాల శివతో పాటు ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. ఈ యాడ్ కి దర్శకత్వం వహించేది కొరటాల శివనే.

కాగా ఆ యాడ్ కి సంబందించిన ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపొయింది. మిస్టర్ కూల్, నీకు నువ్వే సాటి, జై మహేష్ అన్న అంటూ ఇలా నెటిజన్లు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సెట్ లోనే కాదు సెట్ బయట కూడా కూల్ గా కనిపించే ఈ హీరో ముఖంలో ఎప్పుడు ప్రశాంతత కనపడుతుంది. అందుకే కాబోలు మహేష్ బాబు అంటే అమ్మాయిలు తెగ సంబరపడిపోతారు.

ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను, టీజర్ ను విడుదల చేశారు. ‘మహర్షి’ గా టైటిల్ ఖరారు చేసి విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు అనూహ్యమైన స్పందన లభించిన విషయం అందరికి తెలిసిందే. మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

Share

Leave a Comment