మరింత యంగ్‌గా, ఎప్పుడూ చూడనట్టుగా

తన 25వ సినిమా కోసం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు సూపర్‌స్టార్ మహేష్‌ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా జరుగుతోంది. భరత్ అనే నేను తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు సూపర్ స్టార్ 25వ సినిమా కావడం కూడా దీని మీద హైప్ ని పెంచుతోంది.

తమ హీరో ప్రతిష్టాత్మకమైన సినిమా అన్ని రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నారు అభిమానులు. మొదట రెండు వారాలు పాటు ఈ సినిమాలో మిగిలిన నటులు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత మహేష్‌ బాబు షూటింగ్‌ లో పాల్గొననున్నారు.

ఇరవై అయిదవ చిత్రంలో మహేష్‌ ఇంతవరకు కనిపించని విధంగా కనిపించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రం కోసం మహేష్‌ వర్కవుట్స్‌ చేయబోతున్నారట. భరత్‌ అనే నేను తర్వాత విదేశాలకి ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లిన మహేష్‌ ఇంకా తిరిగి రాలేదు.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ చిత్రంలో ప్రత్యేక లుక్‌ కోసం కసరత్తులు చేయనున్నారు మహేష్‌. ఈ లుక్‌తో ఈ సినిమా లో ఇంకా యంగ్‌గా కనిపించబోతున్నారట మన సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.

కేవలం ఫిజికల్‌గానే కాకుండా లుక్స్‌ పరంగాను మహేష్‌ ఇందులో కొత్తదనం చూపిస్తారట. ఇందుకోసం కొన్ని స్కెచెస్‌ కూడా వేయిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు కాగా, దిల్‌ రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు.

ఈ సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తూనే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను హత్తుకునేలా ఆ తరహా బావోద్వేగాలు కూడా ఉండేలా చూస్తున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా చేయనుంది.

మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ భ‌ర‌త్ అనే నేను. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. మ‌హేష్ కెరియ‌ర్ లో మ‌రో బెస్ట్ మూవీగా నిలిచింది.

మే 25న త‌మిళ‌నాట భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో డ‌బ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25న భ‌రత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ కానుంది.

Share

Leave a Comment