ఆ లిస్టులో మళ్ళీ మహేష్ టాప్

మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి సౌత్ మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి. నేషనల్‌ వైడ్‌లో బడా బడా స్టార్స్‌, క్రికెటర్స్‌కి ధీటైన ఫాలోయింగ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉంది.

తాజాగా 2018లో ఇండియాలో విలువైన సెలబ్రిటీల జాబిత వెలువడింది. ఈ లిస్ట్ లో కూడా మహేష్ చోటు సంపాదించుకుని తన వాల్యూ ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు. జాబిత లో ఉండటం అంటే అలా ఇలా కాదు.. రీజనల్ స్థాయి లో మరోసారి నంబర్ వన్ గా నిలిచి సూపర్‌స్టార్ స్టామినా ఏంటో మరోసారి తెలియజేసాడు.

ప్రపంచవ్యాప్తంగా సర్వేలు జరిపే డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ తమ రిపోర్ట్ ను విడుదల చేసింది. టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకునే దేశ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. మనదేశంలో కార్పొరేట్ సంస్థలు తమ ప్రొడక్ట్స్ కు బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లతోనే క్యాంపెయిన్ చేయిస్తుంటాయి. ఈ ఫీల్డ్ లో మహేష్ లాంటి రీజనల్ స్టార్ పర్సనాలిటీ లీడ్ లో ఉండటం పెద్ద విశేషమే అని రీసెర్చ్ తెలిపింది.

టాప్ రీజనల్ సెలబ్రిటీస్ లిస్ట్ ని వారు ఎండోర్స్ చేసుకున్న బ్రాండ్స్ వాల్యూ ఆధరాంగా వెల్లడించారు. ఇందులో మహేష్ ఖాతాలో అత్యుత్తమంగా 15 బ్రాండ్స్ ఉండటం విశేషం. గతేడాది నవంబర్ కల్లా ఒక రీజియన్ వైజ్ 15 బ్రాండ్స్ మహేష్ ని తమ ప్రచారకర్తగా కొనసాగించడం అనేది సరికొత్త చరిత్ర. మునుపెన్నడు ఏ ఇతర సెలెబ్రిటీ ఇటువంటి ఘనత ని సాధించలేదు.

మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బడా కంపెనీలు కోట్లాది రూపాయల ఆఫర్ తో మహేష్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకుంటున్న హీరోల జాబితాలోనూ టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ నంబర్ వన్ గా నిలిచారు.

రీజనల్ తారల్లో మహేష్ తరువాతి స్థానం లో 8 బ్రాండ్లతో తమన్నా ఉన్నారు. ఆ తరువతా దిల్జిత్, రాణా 6 బ్రాండ్ల తో ఈ లిస్ట్ లో చోటు సంపాదించారు. మహేష్ 15 బ్రాండ్ల తో పోలిస్తే అందులో సగం కూడా మరే సౌత్ యాక్టర్ కి లేవంటే మహేష్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. మహేష్ బ్రాండ్ గట్టిగా బజాయించాడు అనడం లో సందేహం లేదు.

హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది. కానీ పరాజయాలు కూడా మహేష్‌ స్థాయిని పెంచుతుంటాయి. ప్రస్తుతం క్రేజ్ విషయం లో మహేష్ రేంజ్ వేరుగా ఉందని చెప్పాలి.

స్టార్‌ వ్యాల్యూ…ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ ప్రధమ స్థానం లో ఉంటారు. ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబే అని చెప్పాలి.

ఇంక సోషల్ మీడియాలో ఆయనను కొట్టేవారే లేరు. అది ఆయన ఫాలోయర్స్ ను చూస్తే తెలిసిపోతుంది. ట్విట్ట‌ర్‌లో మహేష్ కు ఏడు మిలియన్ మంది కి పైగా ఫాలోవ‌ర్స్ ఉన్న సంగతి తెలిసిందే. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్ బాబు. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఆల్ఇండియా వైడ్ విస్తరించడమే కాకుండా ఇప్పటి వరకు ఎవరి ఊహకి కూడా అందని అరుదైన రికార్డులను స్రుష్టిస్తూ తన క్రేజ్ ఎంటే తెలియజేస్తూనే ఉన్నాడు.

భారీ హిట్ తర్వాత భారీగానే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉండాలని వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో కీలకమైంది. హీరోగా 25 వ చిత్రం కావడంతో కొత్త లుక్ తో మహేష్ అదరగొడుతున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా చేసేందుకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Share

Leave a Comment