ఈ సన్నివేశాల ప్రభావం అంతా ఇంతా కాదు

మనం ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ఒక వ్యక్తికి వ్యక్తిగా విలువనివ్వాలి. మనకు డబ్బే జీవితం కాదు..అంతకుమించి బంధాలు, అనుబంధాలు, మన మంచి కోరుకునే నలుగురు మనుషులు ఉన్నప్పడే మనకు పూర్తి సంతృప్తి దొరుకుతుంది అని మనకి తెలిసేలా చేసిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

మనం మంచి తనంతో మెలిగితే మనందరికీ మంచి జరుగుతుందని తెలియజెప్పిన చిత్రం. ఈ చిత్రం లోని సంభాషణలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. పాపులర్ అవ్వటమే కాకుండా మనందరి జీవితంలో అవి రోజు వాడుకునే మాటల్లా కలిసిపోయాయి అంటే ప్రేక్షకుల మనసులలోకి ఎంతగా వెళ్ళాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఓరి దీని ఏషాలో..ఈ డైలాగ్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి కపుల్ నోటి నుండి ఈ మాట ఈ రోజు వరకు వింటున్నాం. ఇది ఈ సినిమాలో అన్నిటికంటే ఎక్కువ ప్రాచుర్యం చెందిన డైలాగ్ గా చెప్పొచ్చు. అమ్మాయిలు ఐ హర్టు అనడం వెంటనే దానికి కౌంటర్గా ఈ డైలాగ్ చెప్పడం యూత్ కి అలవాటు అయిపోయింది.

చిన్నోడు: సెల్ ఫోన్ ఉందా? ; ట్రైన్ కో-పాసెంజర్ ఆమ్మాయి: డాడి నెంబర్, నాకు లేదు ; చిన్నోడు: కుంకుడుకాయలు కొట్టుకోమను దానితో …ఏం చేసుకుంటాడు… ఈ మధ్య నా టైమేంటో నాకే అర్థం కావడం లేదు.. చూసిన రెండు నిమిషాలకు పడిపోతోంది ప్రతీదీ ..

గీత: ఒక అబ్బాయి గా చెప్పు నన్ను చుసినప్పుడు నీకు ఏమి అనిపించింది? ఏంటి ముద్దు పెట్టుకోవాలి హగ్ చేసుకోవాలి అని ఆ రేంజి లో అనిపించిందా.. ; చిన్నోడు: ఏ నీకు అలా అనిపించిందా? ; గీత: ఛి ఛి అనిపించలేదు అసలు అనిపించలేదు ; చిన్నోడు: అనిపించింది అని అబద్దం చెపొచ్చు గా ఈ పాటికి పడిపోయెవాడిని ..

పెద్దోడు: తొక్కలేరా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది..ఎప్పుడూ ఇలాగే ఉంటామా ఏంటి? చెప్పు.. ; చిన్నోడు: కరెక్టే రా.. మనం కొట్టేది ఎదో గట్టిగా కొట్టాలి యెహే.. తొక్కలోది ఐదు వేలకి, ఆరు వేలకి ఏం చేస్తాములే గాని వదిలెయ్.. అని అన్నదమ్ముల మధ్య జరిగే సంభాషన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.

ఆ పెద్దోడు చూస్తే మాట పడడు.. ఈ చిన్నోడూ చూస్తే మాటలతో బూరెలు వండేస్తాడు… ఈ జనాలు ఎంట్రా బాబు..ఎవరి ఇంట్లో వారు కూర్చోరు..పొలోమని వచ్చేత్తారు. కరెక్టు ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవలంటే ఒక్కటి కాదు వంద భగవద్‌గీతలు చదవాలి..

చాలా అనే పదం కూడా ఈ సినిమా వచ్చాక చాలా అంటే చాలా తో రిప్లేస్ అయిందనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి లాగా ఏరా ఏం చేతానవ్ అంటూ పెద్దోళ్ళు అంతా అడగడం…ఎప్పుడూ ఇలాంటి టిపికల్ డైలాగ్స్ ముఖ్యంగా కుటుంబం లోని ఫంక్షన్స్ లో చాలా కామన్..

చిన్నోడు: నవ్వు వస్తే నవ్వాలి.. ఏడుపు వస్తే ఏడవాలి.. అంతే కాని నువ్వు ఇచ్చే లక్ష రూపయలకి ఎలా పడితే అలా నవ్వాలి అంటే నా వల్ల కాదు..ఈ శతాభ్దం లో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏమైనా ఉందంటే అది సెల్‌ఫోన్ ..ఈ నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత సన్నగా ఉంది ..

రావు రమేష్: దురద్రుష్టవంతులతో ఎక్కువ సేపు గడపకూడదు సార్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ..వాడిని ఎవడికైన చూపించండిరా.. అలా వదిలేయకండిరా బాబు.. చిన్నోడు: ఇలా వుండాలి..అలా వుండాలి..అని మా నాన్నే చెప్పలేదు..దారిన వెల్లే గొట్టంగాడి మాటలు ఎందుకు వింటాను..

ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి ..ఉంటాయి ఉంటాయి అంటే ఉండవు.. నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే.. ఏమో నాకు అంతే..అన్ని అలా తెలిసిపోతుంటాయి డైలాగ్ ఈ చిత్రం లో చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. వెటకారంగా కూడా కేవలం ఈ డైలాగ్ బేస్ చేసుకుని అనేక కామెడి షోస్ లో కూడా స్కిట్స్ చేసారు.

మా బాబు బీబత్సంగా సంపాదించేసాడు.. కాని ఎవడి దబ్బులు ఆడే సంపాదించుకోవాలి అంటాడు..ఇంకొక ఐదు నిమిషాలు ఇలానే మాట్లాడావనుకో నేనేక్కడ ముద్దెట్టేస్తానో నాకే తెలీదు.. భారత స్త్రీలు ..జడలు ఏసుకోడం మానేసారే ..ఈ పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారే..

ఇలాంటి సభాషణలు వెరే వారు చెప్తే ఇంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాని మహేష్ తనదైన శైలి తో తన మాడ్యులేషన్ లో ఇలాంటి డైలాగ్స్ చెప్తే మాత్రం ఎప్పుడైనా అవి యూత్ మంత్రా అయి తీరాల్సిందే. ఈ సినిమాలో ఇలాంటి సంభాషణలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో నుండి మచ్చుక్కి కొన్ని సాంపుల్ డైలాగ్స్ మాత్రమే పైన మీ ముందు ఉంచాం.

ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య సంబంధాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి విరుద్ధంగా పూర్తిగా కేవలం పాజిటివ్‌ కోణంలో రాసుకున్న కథ ఇది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మహేష్‌ బాబు, వెంకటేష్‌. అసలు కుటుంబం ఎలా ఉండాలి, సంబంధాలు, ఆప్యాయతాలు ఇత్యాది విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పాయింట్‌ను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల సక్సెస్‌ అయ్యాడు.

చాలా ఏళ్ళ తర్వాత తెలుగు తెరపై ఓ అచ్చమైన తెలుగు సినిమా వెల్లువరిసింది. అసభ్యమైన సన్నివేశాలు, హద్దులు దాటిన ప్రేమ పిచ్చి, ద్వందార్థాలతో వచ్చే చండాలమైన డైలాగులు, భయం పుట్టించే హింసాత్మక సన్నివేశాలు, బూతు సన్నివేశాలు లేకుండా చిన్న పెద్దా అందరూ చూసేల మన తెలుగు కుటుంబాలలో ఒక స్పెషల్ ప్లేస్ పొందడమే కాకుండా ఈ చిత్రంలోని డైలాగ్స్ మన సగటు జీవితం లో భాగం అయిపోయాయి.

Share

Leave a Comment