అతడు తెరవెనుక చూడని సీన్స్

ఈ చిత్రం గురించి ఒక్క వాక్యంలో లో చెప్పడం అంటే చాలా కష్టం. తెలుగు చలనచిత్ర గ్రంథాలయంలో చెక్కు చెదరని ఓ పుస్తకం లాంటిది. చలనచిత్రరంగంలో కొన్ని చిత్రాలు పాఠ్య పుస్తకాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. అలా తెలుగు తెర పై నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం మాయాబజార్. తరువాత ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినా కాని అతడు మాత్రం క్లాసిక్ గా నిలిచిపోయింది.

ఈ చితంలోని కథకి, కథనానికి అత్యంత బలాన్ని ఇచ్చింది మాటలే అని చెప్పాలి. మహేష్ నందు పాత్రతో అరుపులు కేకలు లేకుండా ఎటువంటి ఎమోషన్ అయినా హావ భావాలలో పలికించి ఎంత గొప్ప నటుడో తెలియజేసాడు. ఈ చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం బోరు కొట్టదు, అలాగని పరిమితి కుడా దాటదు.

ఇలా అందరి మనసులని కొల్లగొట్టి అప్పటివరకు వస్తున్న రొటీన్ ఫార్ములా బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన ఈ చిత్రం లో కొన్ని సీన్స్ సమయాభావం వల్ల సినిమా నిడివి పెరుగుతుందని ఫైనల్ కాపీ నుంచి తొలగించారు. ఎడిటింగ్ లో తొలగింపబడ్డ అటువంటి కొన్ని సీన్స్ పిక్స్ రూపం లో మీ ముందు ఉంచబోతున్నాము.

ఈ సన్నివేశాల్లో చాలా వరకు మహేష్ బాబు బాసర్లపుడి లో పార్ధు ఇంటికి వెళ్ళిన తరువాత జరిగేవి. అక్కడ మహేష్ బాబు, త్రిష గారి మధ్య జరిగే సన్నివేశాలలో కొన్ని సినిమా నిడివి తగ్గించడం కోసం ఎడిటింగ్ లో పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. అందులో మొదటి సన్నివేశం కామేడి సీన్ లా అనిపిస్తుంది.

ఇందులో పూరి(త్రిష) సాంప్రదాయబద్దంగా సిగ్గుపడుతూ ఉండగా పార్ధు(మహేష్) చేతిలో మర చెంబు తో పాటు ఒక గ్లాసు ఉంది. పూరి పాత్రను కధానాయిక పాత్రని త్రిష చాలా బాగా పోషించింది. అందంతో పాటు అమయాకత్వం కలగలిపిన ఈ పాత్ర సినిమా కు ఒక హైలైట్ గా చెప్పొచ్చు.

పూరీ ఇంకా పార్ధు మధ్య జరిగే మరో సరదా సన్నివేశం కూడా ఉన్నట్టు అప్పట్లోనే అతడు మేకింగ్ వీడియో లో చూపించారు. పూరి తల మీద పెయింట్ పడే సీన్ కూడా సినిమా లో ఉండదు కాని జెమినీ టీ.వీ వారు వేసిన మేకింగ్ వీడియో లో ఉంటుంది. దీని బట్టి చూస్తే ఇది మరో ఫన్నీ ఎపిసోడ్ అని తెలుస్తుంది.

అతడు సినిమాలో చేసిన పూరి పాత్రను ఇంకా మరచిపోలేదని అతడు ఒక క్లాసిక్ అని మహేష్ బాబు బెస్ట్ కో-స్టార్ అంటూ ఇప్పటికీ చెప్తారు త్రిష. ఇలాంటి సీన్స్ సినిమా లో ఉంటే ఇంకెంత బావుంటాయో అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇవే కాకుండా మనకి తెలియని మరో రెండు సన్నివేసాలు కూడా ఉన్నాయి.

మరొక దాంట్లో పూరి మోడ్రన్ దుస్తులలో చేతిలో జూస్ బాటిల్ ఇంకా నోట్లో రోజా పువ్వు ఉండాగా మహేష్ చేతిలో ఒక గ్లాసు ఇంకో చేత్తో ఆ రోజా పువ్వును తీసుకుంటున్నట్టు ఉంది. ఈ సన్నివేశం చిత్రం లో పాట సందర్భంగా వస్తుంది అని అనుకోవచ్చు. పార్ధు పూరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా లో అద్భుతంగా పండింది.

‘అతడు’ సినిమా సమయంలో మనకి తెలియని తెర వెనుక జరిగిన ఇంకో రిస్కీ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ లు చాలా రిస్కీ ప్రదేశం లో షూట్ చేయాలని అనుకున్నారు. అక్కడ జనాల రద్దీ దృష్ట్యా మామూలుగా సెలబ్రెటీలు తిరగడమే కష్టం. అలాంటిది అక్కడ చిత్రీకరణ చేశాడు.

ఒక సీన్ ను పాతబస్తీలోని మీర్ చౌక్..మీరాలం మండీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. కథానుసారంగా ఆ ప్రాంతాల్లో అయితేనే సీన్స్ సహజంగా వస్తాయనే ఉద్దేశ్యంతో అక్కడ ప్లాన్ చేశారు. మహేష్ కూడా సినిమా కోసం ఏమైనా చేసే టైప్. ఆ ప్రదేశంలో షూటింగ్ అంటే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా భయపడ్డారు.

మహేష్ ను రిస్క్ లో పెడుతున్నారని త్రివిక్రమ్ ను వారించారు. అయినా కూడా త్రివిక్రమ్, మహేష్ అనుకున్నట్లుగా పాతబస్తీలో చిత్రీకరణ జరిపారు. ఇంతకి ఇక్కడ ఏం షూట్ చేసారా అనుకుంటున్నారా? సినిమా మొదట్లో జరిగే మర్డర్ హైలైట్ గా నిలించింది కదా..ఆ సీన్, దాని అనంతరం జనం మధ్యలో నుండి మహేష్ పరిగెడుతూ గోడ దూకి వెళ్ళేవరకు ఈ ఏరియా లోనే చిత్రీకరించారు.

హీరోయిజం అంటే అప్పటి వరకు పెద్ద పెద్ద సంభాషణలు, అరుపులు ఉండేవి..ఈ చిత్రం తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మొదట్లో ఒక వ్యక్తిని చంపి పారిపోతున్న నందు చిన్నప్పటి పాత్రను చూపిస్తూ వేసిన ప్రదేశం తాలూకు వివరం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది. మహేష్ నందు పాత్రకు ఎక్కువ మాటలు లేవు కానీ పలికిన కొన్ని మాటలు కూడా తూటాల్లా పేలాయి.

నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయ్యలనుకోవటం మోసం. మనల్ని చంపాలనుకునేవాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం. మనల్ని మోసం చేయాలనుకునేవాడిని చంపడం న్యాయం అనే డైలాగ్ ఈ సినిమా థీమ్ ని స్పష్టంగా చెప్తుంది.

గన్ను చూడలనుకోండి తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడలనుకోవద్దు చచ్చిపోతారు వంటి సీరియస్ డైలాగ్స్ తో పాటు పదేళ్ళకే అన్ని చూసేస్తే పాతికేళ్ళకు టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? పాపం అమ్మ వాళ్ళు వీణ్ణి కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు, చాలా కంప్లికేటెడ్ బాయ్ వంటి సరదా డైలాగ్స్ ఉండటం విశేషం.

వెండితెర పై ఉండగా ఈ చిత్రం ఎందరో మనసులకి హత్తుకుంది. ఇది బుల్లితెర పై వస్తే ఇప్పటికీ చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు,వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు వాటిని ఆపాదించుకొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

Share

Leave a Comment