చూడని సన్నివేశాలు

తెలుగు చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు చిరస్థాయి లో నిలిచిపోతాయి. అవి ఒక బెంచ్‌మార్కుని సెట్ చేసి రాబోయే తరానికి పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. అటువంటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు, వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు వాటిని ఆపాదించుకొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

అతడు కథ పెద్దగా చిక్కుముళ్ళు లేని కథే. మాములుగా అయితే ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప దర్శకుడు పెద్దగా మెదడుకి పని చెప్పిన సందర్భం లేదు. ఈ చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం బోరు కొట్టదు, అలాగని పరిమితి కుడా దాటదు. తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని పుస్తకంలా అనిపించే చిత్రాలలో అతడు తప్పకుండా ఉండి తీరుతుంది.

కథనం, మాటలు, దర్శకత్వం, హీరోయిజం, సంగీతం మరియు ఇతర సాంకేతిక బృందం సమిష్టి కృషి ఒక చిత్రాన్ని గొప్ప చిత్రంగా నిలబెట్టగలవు అని అతడు నిరూపించింది. ఇలా అందరి మనసులని కొల్లగొట్టి అప్పటివరకు వస్తున్న రొటీన్ ఫార్ములా బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన అతడు చిత్రం లో ఎవరూ చూడని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.

కొన్ని సీన్స్ సమయాభావం వల్ల సినిమా నిడివి పెరుగుతుందని ఫైనల్ కాపీ నుంచి తొలగించారు. రెండు నుంచి మూడు సన్నివేశాల వరకు అతడు ఫైనల్ కాపీ నుంచి తొలగించబడ్డాయి. ఎడిటింగ్ లో తొలగింపబడ్డ అటువంటి కొన్ని సీన్స్ పిక్స్ రూపం లో మీ ముందు ఉంచబోతున్నాము.

1) మహేష్ బాబు బాసర్లపుడి లో పార్ధు ఇంటికి వెళ్ళిన తరువాత జరిగే సన్నివేశం ఇది. అక్కడ మహేష్ బాబు, త్రిష గారి మధ్య జరిగే సన్నివేశం సినిమా నిడివి తగ్గించడం కోసం ఎడిటింగ్ లో పక్కన పెట్టారు. పూరి(త్రిష) సాంప్రదాయబద్దంగా సిగ్గుపడుతూ ఉండగా పార్ధు(మహేష్) చేతిలో మర చెంబు తో పాటు ఒక గ్లాసు ఉంటుంది.

2) రెండో సన్నివేశం కూడా పార్ధు ఇంటిలో జరిగేదే. పార్ధు(మహేష్) తన రెండు చేతులను జాపగా పూరి(త్రిష) ఒక వేలును మహేష్ కు చూపిస్తూ ఉంటుంది. పూరీ ఇంకా పార్ధు మధ్య జరిగే మరో సరదా సన్నివేశం అని మనం ఈ ఫొటో చూసి చెప్పవచ్చు.

3) ఇక మూడో సన్నివేసం త్రిష కు సంబంధించినది. పూరి తల మీద పెయింట్ పడే సీన్ ఇది. పూరి పాత్రను కధానాయిక త్రిష చాలా బాగా పోషించారు. అందంతో పాటు అమయాకత్వం కలగలిపిన ఈ పాత్ర సినిమా కు ఒక హైలైట్ గా చెప్పొచ్చు.

4) నాలుగో సన్నివేశం మళ్ళీ పార్ధు(మహేష్), పూరి(త్రిష) ల మధ్య సన్నివేశమే. పూరి(త్రిష) మోడ్రన్ దుస్తులలో చేతిలో జూస్ బాటిల్ ఇంకా నోట్లో రోజా పువ్వు ఉండాగా పార్ధు(మహేష్) చేతిలో ఒక గ్లాసు ఇంకో చేత్తో ఆ రోజా పువ్వును తీసుకుంటున్నట్టు ఉంది ఆ సన్నివేశం.

అతడు సినిమాలో చేసిన పూరి పాత్రను ఇంకా మరచిపోలేదని అతడు ఒక క్లాసిక్ అని మహేష్ బాబు బెస్ట్ కో-స్టార్ అంటూ ఇప్పటికీ చెప్తారు త్రిష. పార్ధు పూరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా లో అద్భుతంగా పండింది. ఈ సీన్స్ కూడా అతడు సినిమా లో ఉండి ఉంటే ఇంకెంత బాగుండేదో కదా.

అతడు సినిమా సమయంలో మనకి తెలియని తెర వెనుక జరిగిన ఇంకో రిస్కీ ఇన్సిడెంట్ ఒకటి ఉంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ లు చాలా రిస్కీ ప్రదేశం లో షూట్ చేయాలని అనుకున్నారు. అక్కడ జనాల రద్దీ దృష్ట్యా మామూలుగా సెలబ్రెటీలు తిరగడమే కష్టం. అలాంటిది అక్కడ చిత్రీకరణ చేశారు. ఒక సీన్ ను పాతబస్తీలోని మీర్ చౌక్, మీరాలం మండీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు.

కథానుసారంగా ఆ ప్రాంతాల్లో అయితేనే సీన్స్ సహజంగా వస్తాయనే ఉద్దేశ్యంతో అక్కడ ప్లాన్ చేశారు. మహేష్ కూడా సినిమా కోసం ఏమైనా చేసే టైప్. ఆ ప్రదేశంలో షూటింగ్ అంటే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా భయపడ్డారు. మహేష్ ను రిస్క్ లో పెడుతున్నారని త్రివిక్రమ్ ను వారించారు. అయినా కూడా త్రివిక్రమ్, మహేష్ అనుకున్నట్లుగా పాతబస్తీలో చిత్రీకరణ జరిపారు. ఇంతకి ఇక్కడ ఏం షూట్ చేసారా అనుకుంటున్నారా? సినిమా మొదట్లో జరిగే మర్డర్ హైలైట్ గా నిలించింది కదా ఆ సీన్, దాని అనంతరం జనం మధ్యలో నుండి మహేష్ పరిగెడుతూ గోడ దూకి వెళ్ళేవరకు ఈ ఏరియా లోనే చిత్రీకరించారు.

ఈ చిత్రం వెండితెర పై ఉండగా ఎందరో మనసులకి హత్తుకుంది. ఇప్పటికీ ఇది బుల్లితెర పై వస్తే చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు, వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు వాటిని ఆపాదించుకొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

ఒక్కడు, అర్జున్ చిత్రాల తరువాత అంతకంటే పరిపూర్ణమైన నటనని మహేష్ నుండి రాబట్టగలిగారు త్రివిక్రమ్. తక్కువ మాట్లాడుతూ ఉండే నందు పాత్రని అద్భుతంగా పోషించాడు మహేష్. ఆ సంవత్సరం ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. కధానాయిక పాత్రని త్రిష చాలా బాగా పోషించింది.

గుహన్ ఛాయాగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏ సన్నివేశంలోనూ ఏ రంగు ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ కి ఈస్ట్‌మెన్ కలర్ కి మధ్యలో ఉంటుంది. నందు తన గతం చెప్పిన తరువాత వచ్చే ట్రాలీ షాట్ చాలా బాగుంటుంది. మరో షాట్ విరామ సమయంలో వచ్చే షాట్. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి బాగా చేరువ చేసింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలకి ప్రాణం పోసింది.

Share

Leave a Comment