చాలా గర్వంగా ఉంది

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా సక్సెస్ ని ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరో పక్క వచ్చే నెలలో తన 26వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాలీ సమయం దొరికినప్పుడుల్లా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన ప్రిన్స్. ప్రస్తుతం అలాటి ట్రిప్ లోనే ఉన్నారు ఆయన.

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా 22 సీట్లు గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రసవత్తరంగా సాగిన ఎన్నికల ఫలితాల్లో ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు గల్లా జయదేవ్. గుంటూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించారు.

వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4800 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన మోదుగులను చివర్లో గల్లా పుంజుకొని ఓడించడం విశేషం. గల్లా విజయంపై ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. గర్వంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి రెండో సారి విజయం సాధించిన గల్లా జయదేవ్ కు మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది మరుపురాని విజయంగా ఆయన పేర్కొన్నారు. కాగా మహేష్ కు గల్లా జయదేవ్ స్వయానా బావ అయిన విషయం తెలిసిందే. భారీ ఉత్కంఠ నడుమ గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెహన్ రెడ్టి ఊహించని మెజారిటీతో భారీ విజయం సాధించారు. పోటీ చేసిన మొత్తం స్థానాల్లో ముప్పావు వంతు స్థానాలను చేజిక్కించుకున్నారు. మరోవైపు దేశంలో బీజేపీ హవా కొనసాగింది. మళ్లీ మోదీనే ప్రధాని కావాలని కోరుకున్నారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీ విజయంపై మహేష్ బాబు తనదైన కోణంలో స్పందిస్తూ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు తన ట్విట్టర్ లో వైసీపీ అధినేత జగన్ కి అబినందనలు తెలిపారు. ‘ఆంద్రప్రదేశ్ లో భారీ మెజారిటీ తో విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్. ముఖ్యమంత్రిగా మీ పదవీకాలంలో ఆంధ్ర రాష్ట్రము విజయాన్ని పొందుతుందని గొప్ప ఎత్తుకు ఎదుగుతుందని భావిస్తున్నాను’ అంటూ ప్రిన్స్ ట్వీట్ చేశారు.

కేంద్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు మహేష్ బాబు. ‘మోదీజీ మీ విజయానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం ఇలాగే ఎంతో కాంతి వంతంగా ముందుకెళ్లాలని కోరుతున్నా’ అని మరో ట్వీట్ చేశారు మహేష్. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’లో యంగ్ సీఎంగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా పోలీషియన్స్‌కి మంచి సందేశమిచ్చారు. దీంతో రీల్ యంగ్ సీఎం శుభాకాంక్షలు అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఎవరు ఎటువంటి విజయాన్ని అందుకున్నా, వారికి తన వంతుగా అభినందనలు తెల్పడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్.

ఇక మహేష్ నటించిన తాజా సినిమా మహర్షి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది. మే 9 వ తేదీన విడుదలైన మహర్షి ఇప్పటికీ కూడా చాలా ఏరియాల్లో అసలు డ్రాప్స్ అనేవి లేకుండా మంచి జోరు మీద దూసుకుపోతోంది. మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో మహర్షి సక్సెస్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు అయన నటించబోయే నూతన చిత్రనికి సంబంధించి అప్పుడే అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అయన విదేశాల నుండి తిరిగి రాగానే అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు.

ఒక సారి సినిమా సెట్స్ పైకి వెళితే వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోంది. కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ దర్శకుడు అనీల్ రావిపూడి, అనీల్ సుంకర బృందం బిజీగా ఉన్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను బరిలో ఉంచాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.

Share

Leave a Comment