ట్రేడ్‌మార్క్ సినిమా అని ప్రశంసలు

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించారు. ఈ సినిమా మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సర్కార్ సినిమా చూసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘సర్కార్ ఒక ఎన్‌గేగింగ్ పొలిటికల్ డ్రామా. పూర్తిగా ఎంజాయ్ చేసాను. ఇది మురుగదాస్ ట్రేడ్ మార్క్ సినిమా. సర్కార్ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేసారు మహేష్‌బాబు.

మహేష్‌బాబు సర్కార్ సినిమా మీద ట్వీట్ చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ మురుగదాస్ ను పొగుడుతూ మహేష్ ట్విట్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. దీనికి కారణం మహేష్ నటించిన స్పైడర్ సినిమా. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన సినిమా స్పైడర్.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. తనకు అలాంటి సినిమాను ఇచ్చిన దర్శకుడుని ఇంకా పొగుడుతూ మహేష్ ట్వీట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది సూపర్‌స్టార్ మంచితనానికి నిదర్శనమని అభిమానులు చెప్తున్నారు.

నిజమే మరి ఎంత మంచితనం కాకపోతే మహేష్ అలా ట్వీట్ చేస్తాడు చెప్పండి. డర్శకులకు మహేష్ ఎంత విలువ, గౌరవం ఇస్తాడో దీంతూ ఇంకోసారి ఋజువు అయ్యింది. తను ఇగో లేని సూపర్‌స్టార్ అని మరో సారి ప్రోవ్ చేసారు మహేష్ బాబు. సూపర్‌స్టార్ కు అసలైన నిర్వచనం చెప్పారు.

‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ ‘మహర్షి’. ఈ మూవీ కోసం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యూఎస్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొద్దిరోజుల విరామం అనంతరం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.

Share

Leave a Comment