ఉత్కంఠకు గురి చేసింది

ఇప్పటి వరకు క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దాదాపుగా అన్ని ఫైనల్స్‌లోనూ ఓ జట్టు భారీగా పరుగులు చేయడం ఛేజింగ్‌కు దిగిన జట్టు తడబడటం చూశాం. లేదంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమే తెలుసు.

కానీ 2019 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ఎంతో ప్రత్యేకం. మ్యాచ్‌తోపాటు సూపర్ ఓవర్ కూడా టై ముగిసింది. విజయం కోసం ఇరు జట్లు ఎంతలా పోరాడాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చివరకు ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రికెట్ ప్రేమికుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది.

కానీ అత్యద్భుమైన క్రికెట్ మ్యాచ్ చూశామనే భావన మాత్రం అందరిలో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఎందరో ఈ వరల్డ్ కప్‌ ఫైనల్ మీద తమ అభిప్రాయాలను తెలిపారు. న్యూజిలాండ్ ప్రదర్శనను ఏ మాత్రం తక్కువ కాదంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వరల్డ్ కప్ ఫైనల్‌పై స్పందించారు.

ఇప్పటికీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఉన్నా. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. గ్రేట్ క్రికెట్. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ బాబు ఏం చేసినా అది సంచలనమే. అభిమానులు అంత చురుకుగా దాన్ని వైరల్ చేస్తుంటారు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. వరల్డ్ కప్ లో ఓవల్ లో జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ ని ఫ్యామిలీ సమేతంగా వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా నమ్రత, మహేష్ షేర్ చేశారు.

తన కుమారుడు గౌతమ్ కు క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూపించడం కోసమే ఇంగ్లాండ్ వెళ్ళినట్లు మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం సర్ ఆండీ రాబర్ట్స్‌ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మహేష్. నేను ఆయనకు వీరాభిమానిని. గొప్ప ఫ్యాన్ మూమెంట్ అంటూ ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

25వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో మహేష్ 26 వ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు తగ్గట్లే సరిలేరు నీకెవ్వరు ఉండబోతుందని కొబ్బరి కాయ కొట్టిన రోజే ప్రేక్షకులకు చెప్పేసారు అనిల్ రావిఫూడి.

ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ‌కీయాల కార‌ణంగా 13 ఏళ్లు సినిమాల‌కు విరామం తరువాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారు, జ‌గ‌ప‌తి బాబు గారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ తోనే సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలను అమాతం పెంచేస్తున్నారు అనిల్ రావిఫూడి.

ఇంక కధ ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో మరి. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటిస్తున్నారని అనీల్ రావిపూడి స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేయడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు.

మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Share

Leave a Comment